మే 9, 1990 జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా రిలీజైన రోజు. రెండురోజుల్లో ఆ సినిమా రిలీజై 30 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుంది. తెలుగు సినిమా స్టామినాని అప్పట్లోనే చాటిచెప్పిన సినిమా ఇది. 30 ఏళ్ళు కాదు మరో ముప్పై ఏళ్ళు గడిచినా తెలుగు సినిమా అంటే చెప్పుకునే కొన్ని గొప్ప సినిమాల్లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు జగదేకవీరుడు అతిలోకసుందరి నిర్మాత అశ్వనీదత్. ఇక ఈ సినిమాకు సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నామని చెప్పిన నిర్మాత కథ ఇప్పటికే ఓకే అవగా కాస్టింగ్ సెలెక్ట్ చేయాల్సి ఉందని అంటున్నారు. 


ఇక జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వల్ చేస్తే అది చిరు వారసుడు రామ్ చరణ్, శ్రీదేవి వారసురాలు జాన్వితోనే చేయాలని కొందరు అంటున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఆ జగదేకవీరుడు సినిమా చేస్తే అందులో రామ్ చరణ్ నటిస్తే సూపర్ అనేస్తున్నారు. జాన్వీ కూడా ఈ సినిమాలో నటించడానికి అడ్డు చెప్పే ఛాన్స్ లేదు. ఇక ఈ సీక్వల్ ను రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేస్తారా లేక మరెవరైనా చేస్తారా అన్నది చూడాలి. 


జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సీక్వల్ అనగానే ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ఆచార్య సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నాడు చరణ్.. ఈ సినిమా తర్వాత జగదేక వీరుడు సీక్వల్ ఉంటుందని అంటున్నారు. మరి ఈ సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ ఎవరు దానికి సంబందించిన డిటైల్స్ తెలియాల్సి ఉంది. వినయ విధేయ రామ తర్వాత కథల విషయంలో రామ్ చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జగదేకవీరుడు సీక్వల్ కథ కూడా లైన్ చిరుకి నచ్చిన తర్వాతే రామ్ చరణ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సీక్వల్ లో చిరు గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: