సినిమాల్లేక పోవటంతో సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కాలం గడిపేస్తోంది హాట్ బ్యూటీ ఇలియానా. బాలీవుడ్ ఆశలతో టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పిన ఈ బ్యూటీకి అక్కడ కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. తరువాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది ఈ బ్యూటీ. ఇటీవల బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకున్న ఈ భామ ప్రస్తుతం సోలోగా టైంపాస్ చేస్తోంది.
కరోనా కారణంగా లాక్ డౌన్ కావటంతో ఇంట్లోనే ఉంటున్న ఇలియానా గతాన్ని గుర్తు చేసుకుంటూ టైం పాస్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది. బీచ్‌లో బికినీతో సేద తీరుతున్న ఫోటలతో పాటు తన డెయిలీ యాక్టివిటీస్‌కు సంబంధించిన అప్డేట్స్ను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. గతంలో తను ఫాట్‌గా ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ ఆ రోజుల్లో జీన్స్ ఎలా వేసుకునే దాన్నో.. ఒక్కోసారి జీన్స్ వేసుకుంటుంటే ఏడుపు వచ్చేది అంటూ కామెంట్ చేసింది. ఇప్పటికే ఈ కామెంట్‌కు 9 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.