ఇప్పుడు మన తెలుగులో వస్తున్న కొన్ని సినిమాలు కథకు ప్రాధాన్యత ఇస్తూ కమర్షియల్ గా వస్తున్న సినిమాలే. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు కూడా కమర్షియల్ కోణం లోనే ఉంటున్నాయి. అంతే కాదు ఇప్పుడు బాలీవుడ్ నటులు ఉంటేనే సినిమా కమర్షియల్ గా విజయం సాధించే అవకాశం ఉంటుంది అనే భావన లో కూడా దర్శక నిర్మాతలు హీరోలు ఉన్నారు అనేది వాస్తవం. ప్రస్తుతం చిన్న చిన్న హీరోలు కూడా బాలీవుడ్ నటులను తమ సినిమాల్లోకి తీసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరో నానీ. 

 

తాను త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయడం దాదాపుగా ఖాయం అయింది. ఆ సినిమా కోసం ఇప్పుడు నానీ కొందరు నటుల పేర్లను బాలీవుడ్ నుంచి చెప్తున్నాడు అని సమాచారం. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గానీ బాలీవుడ్ నటులు ఉండాలి అనేది అతని డిమాండ్ అని అంటున్నారు టాలీవుడ్ జనం. తనకు ఇప్పుడు పూర్తి స్థాయి కమర్షియల్ హీరోగా మారాలి అనే ఉద్దేశం ఉంది అని అందుకే ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేసే ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. 

 

సినిమా తర్వాత నానీ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి లేదా ఆ సినిమాకంటే ముందే నానీ తో త్రివిక్రమ్ సినిమా చేయవచ్చు. తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా మీద ఉన్నాడు. ఆ సినిమా లేట్ అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వస్తుంది. ఆ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: