టాలీవుడ్ లో షూటింగ్ మొదలు కాకపోయినా చర్చలు నడుస్తున్న సినిమా మాత్రం పుష్పా. సుకుమార్ దర్శకత్వంలో... అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా వరకు కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో అతను ఒక వైకల్యం తో నటించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ సినిమా కోసం వేరే సినిమాలను కూడా అతను దాదాపుగా పక్కన పెట్టాడు అని టాలీవుడ్ లో ఇప్పుడు టాక్ వినపడుతుంది. అది ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే... 

 

ఇప్పుడు ఈ సినిమా కోసం నటులను ఎంపిక చేసే పనిలో సుకుమార్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్ ఎంపిక మాత్రం అతనికి బాగా ఇబ్బంది గా మారింది అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఈ సినిమాలో ఏ హీరోయిన్ ని తీసుకోవాలి అనే స్పష్టత ఆయనకు రావడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో ముందు రష్మిక మందన ను తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది గాని ఆమె అందుకు నో అని చెప్పినట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో నటించడానికి పూజ కూడా నో చెప్పింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

దీనికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమె మాత్రం ఈ సినిమాలో నటించేది లేదు అని స్పష్టంగా చెప్పినట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఆమె పాత్రకు అంత గ్లామర్ ఉండదు అని నటనకు ప్రాధాన్యత ఉన్న సరే గ్లామర్ లేకపోతే మాత్రం తాము చేసేది లేదని ఇద్దరు హీరోయిన్ లు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ఈ సినిమాను వచ్చే ఏడాది ఎలా అయినా తీసుకొచ్చే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: