తెలుగులో అయినా తమిళంలో అయినా సరే మంచి పాపులారిటి తెచ్చుకున్న హీరోయిన్ లు కొందరు ఉన్నారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే వారికి ప్రత్యేకంగా గుర్తింపు వచ్చింది. ఒక్క సినిమా చెయ్యాలి అనుకున్న హీరోలు ఉన్న హీరోయిన్ లు కూడా ఉన్నారు. ఒక్కో సినిమా తో తమ రేంజ్ ని పెంచుకున్న హీరోయిన్ లు కూడా ఉన్నారు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ త్రిష. వర్షం సినిమా తర్వాత ఆమె రేంజ్ బాగా పెరిగింది. వరుస అవకాశాలు వచ్చాయి ఆమెకు. ఆ సినిమాలు అన్నీ కూడా ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. 

 

ఆమె కెరీర్ లో వర్ష౦ సినిమా మంచి హిట్ గా చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి అగ్ర హీరోలతో ఆమెకు సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమెకు మళ్ళీ ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమెకు ప్రభాస్ కి ఈసారి విలన్ గా నటించే ఛాన్స్ వచ్చింది అని కాని ఆ సినిమాలో ఆమె పూర్తి స్థాయి విలన్ గా కాదు ఒక చిన్న విలన్ పాత్ర కాని సినిమా మాత్రం ఆమె పాత్ర మీద ఆధారపడి ఉంటుంది. ఆ సినిమాలో ఆమెకు అవకాశం ఇవ్వడానికి ప్రభాస్ ఓకే చెప్పాడు అని సమాచారం. 

 

సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకు ఏ సినిమాలో అంటే జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ఆమె ఈ పాత్ర చేస్తున్నట్టు సమాచారం. ఇక తమిళంలో ఇప్పుడు ఆమెకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ ఆమెకు వయసు మీద పడుతున్నా సరే వరుస ఆఫర్లు వస్తున్నాయి. అక్కడ మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా ఆమె ఒక వెలుగు వెలుగుతుంది ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: