తెలుగు సినీ  పరిశ్రమలో కొన్ని హిట్ పెయిర్స్ అలా నిలిచిపోతాయి. కొన్ని కామ్భినేషన్లు మంచి విజయాలను అందుకోవడమే కాక అధిక సంఖ్యలో అభిమానులను సంపాదించు కుంటాయి. అలాంటి క్రేజీ కామ్భినేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరూ కలిశారంటే ఇండస్ట్రీలో మళ్ళి ఒక ప్రభంజనమే అని అభిమానుల అంచనా. గతంలో జల్సా, అత్తవారింటికి దారేది వంటి చిత్రాలు భారీ విజయాలను అందుకున్న సంగతి తెల్సిందే. అయితే పవన కళ్యాన్ కెరీర్ లో జల్సా సినిమా కీలక మలుపు అనే చెప్పుకోవాలి. 

 

అయితే తాజా గా త్రివిక్రమ్, పవన్ కోసం కథ, మాటలు తయారు చేస్తున్నట్టు సిని వర్గాల కథనం. మరి ఆయన డైరెక్షన్ చేస్తారో లేదో తెలియాల్సి ఉంది. గతంలో కూడా పవన్ కోసం తీన్మార్ సినిమా లో కథ, మాటలు అందించిన సంగతి తెలిసిందే. గోపాలా, గోపాల డైరెక్టర్ డాలీ పవర్ స్టార్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీని కోసమే త్రివిక్రమ్ మాటలు సిద్దం చేసినట్టు సిని వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. 

 

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలను, ఇటు సినిమాలను కూడా బాగానే నడిపిస్తున్నారని ఇండస్ట్రీ టాక్.  పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రవేశించి క్రియాశీలక రోల్ పోషిస్తున్న సంగతి తెల్సిందే. దీని కారణంగా గత కొంత కాలం గా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంభి నేషన్ సినిమా వస్తున్నట్టు టాక్. వీరి సినిమా అంటే మన తెలుగు ప్రజలే కాక పక్క రాష్ట్రాల ఇండస్ట్రిలు కూడా ఇటు వైపే చూస్తాయి అనడంలో సందేహం లేదు. దీనికి కారణం గతంలో వచ్చిన విజయాలే.

మరింత సమాచారం తెలుసుకోండి: