స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మెడిసిన్ కొంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ.. ఆమె లిక్కర్ తీసుకెళ్తోందని సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. రీసెంట్ గా ఓ కన్నడ బేస్డ్ వెబ్ సైట్ ఈ వీడియో గురించి ట్వీట్ చేసింది. అందులో రకుల్ ప్రీత్ ‘ఆల్కహాల్’ కొని తీసుకెళ్తోందా? అని రాశారు. దీంతో ఆ వైబ్ సైట్ పై రకుల్ మండిపడింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్ దీనిపై ఘాటుగానే రియాక్ట్ అయింది.

 

 

’ఓ నిజమా.. మెడికల్ షాపుల్లో కూడా ఆల్కహాల్ అమ్ముతారని నాకు తెలీదు’ అంటూ మండిపడింది. ఆ వైబ్ సైట్ ట్వీట్ ను లింక్ చేస్తూ తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ పోస్ట్ వైరల్ గా మారింది. రెండు మూడు రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా కేంద్రం ఆల్కహాల్ సేల్ కు అనుమతి ఇచ్చిన తర్వాత ఈ వీడియో బాగా వైరల్ అయిపోయింది. కొంతమంది ఆకతాయిలు రకుల్ లిక్కర్ తీసుకెళ్తోందంటూ వైరల్ చేసేశారు. రకుల్ ఇచ్చిన కౌంటర్ కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

 

 

‘మెడికల్ షాప్ కు లిక్కర్ షాప్ కు తేడా తెలీటం లేదా’, ‘ఎందుకు ప్రతీది వైరల్ చేస్తారు’, ‘మాస్క్ పెట్టుకుని మందులు కొంటుంటే కనబడటం లేదా’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా రకుల్ ప్రీత్ కు సంబంధించి పలు ఫోటోలు వైరల్ అయ్యాయి. అప్పట్లో కూడా రకుల్ ఇలానే స్పందించింది. రకుల్ పోస్ట్ సదరు వెబ్ సైట్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టైంది. ఇప్పటికైనా రకుల్ పై ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడతాయేమో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: