చియాన్ విక్రమ్ కనిపించి చాలా కాలమైనా.. ఎవరూ టచ్ చేయలేని సబ్జెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ విలక్షణ నటుడు నటిస్తున్న నాలుగు సినిమాల గురించి చెప్పాలంటే అదో మహాభారతమవుతుంది. నిజమే.. మహాభారతంలో కర్ణుడిలా నటిస్తున్నాడు. 

 

విలక్షణ నటుల గురించి చెప్పాల్సి వస్తే.. అందులో విక్రమ్ కూడా ఉంటాడు. సినిమా కథలో.. క్యారెక్టర్ లో వేరియేషన్ చూపిస్తున్నా.. బాక్సాఫీస్ ను మెప్పించలేకపోతున్నాడు. తెలుగులో అయితే.. అపరిచితుడు తర్వాత ఇంతవరకు సరైన సక్సెస్ దక్కలేదు. పెయిల్యూర్స్ ఎన్ని వచ్చినా.. ఎక్స్ పెరిమెంట్స్ ను వీడకుండా.. దూసుకుపోతున్నాడు విక్రమ్.

 

54ఏళ్ల వయసులోనూ విక్రమ్ జోరు చూపిస్తున్నాడు. ప్రస్తుతం నాలుగు సినిమాలు కోబ్రా.. ధృవ నక్షత్రం.. మహా వీర్ కర్ణ.. పొన్నియన్ సెల్వన్ లో నటిస్తున్నాడు. ముందుగా కోబ్రా రిలీజ్ కానుంది. దశావతారంలో కమల్ హాసన్ 10 పాత్రలో పోషిస్తే.. అమ్మో అన్నారు. ఇప్పుడీ రికార్డును విక్రమ్ బ్రేక్ చేస్తున్నాడు. దశావతారం కంటే ఒకటి రెండు ఎక్కువ గెటప్స్ కాదు. కోబ్రాలో పాతిక పాత్రలు పోషించనున్నాడట. సినిమా సినిమాకు గెటప్ లో వేరియేషన్ చూపించే విక్రమ్ ఈ సారి పాతిక పాత్రల్లో ఎలా వైవిధ్యం చూపిస్తాడో చూడాలి. అజయ్ ముత్తు డైరెక్ట్ చేసే ఈ మూవీని.. 7 స్క్రీన్ స్టూడియోస్.. వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎ.ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.  

 

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న ధృవ నక్షత్రం 2016లో ప్రారంభమైనా.. కొన్ని కారణాల వల్ల ఇంతవరకు రిలీజ్ కు నోచుకోలేదు. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రీతూవర్మ.. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ కాగా.. హరీశ్ జైరాజ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. 

 

అదేమిటో గానీ.. విక్రమ్ నటిస్తున్న నాలుగు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే. కథగా చెప్పాల్సి వస్తే... దేనికదే అన్నట్టు ఉంటుంది. రావన్ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ మూవీ చేస్తున్నాడు. 200కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం సెట్స్ పైకి రావాల్సి ఉంది. ధృవనక్షత్రం మినహా మిగతా మూడు సినిమాలకు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: