బుల్లి తెర మీద యాంకరింగ్ లో మెప్పిస్తూనే ఇటు సినిమాల్లో కూడా ఒక ఇమేజ్ ని సెట్ చేసుకుంది అనసూయ. బుల్లి తెర యాంకర్ లు అందరిలోనూ అనసూయ తనదైన స్టయిల్ లో మోడరన్ గెటప్ లతో కొత్త వరవడి  సృష్టించింది. జబర్దస్త్ షో ద్వారా హటాత్తుగా తన ఇమేజ్ బాగా పాపులర్ అయ్యింది. ఇక అప్పటి నుండి వెండి తెర చాన్స్ లు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆ క్రమంలో రాం చరణ్ హీరోగా తెర కెక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా మంచి క్రేజ్ సంపాదించింది. 

 

ఇదే అదనుగా కెరీర్ ని ఒక ప్లాన్ తో మలచుకుంది అనసూయ. చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినా తన పాత్ర యొక్క ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. దీని తో దర్శక, నిర్మాతలు అనసూయ కోసం వైవిధ్యమైన పాత్రలను సృష్టిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆచార్య సినిమాకు గాను అనసూయకు ఒక కీలక పాత్రను రెడీ చేసారు. అదేమిటంటే ప్లాష్ బ్యాక్ లో రాం చరణ్ పక్కన ఒక సన్నివేశంలో నటించి ఒక ఐటెం సాంగ్ చేయాల్సి ఉంది. ఇప్పటికే చిరంజీవితో ఉన్న కథలో రేజీనా ఒక ఐటెం సాంగ్ చేస్తుండగా రెండవది అనసూయ తో ఎందుకు ఉంటుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

సినిమా మాత్రమే కాక అనసూయ కృష్ణ వంశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ మార్తాండలో కీలక పాత్ర చేయనుంది. ఈ సినిమాకు గాను రమ్య కృష్ణ, అనసూయ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో అనసూయ దేవదాసి పాత్రలో కనిపించబోతుందని సిని వర్గాల కథనం. ఈ పాత్ర వల్ల అన్సుయకు మరింత గుర్తింపు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సినిమాలు, టివి షోలతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలోను ఎంతో చురుగ్గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: