ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని విశాఖలో జరిగిన ఘోర గ్యాస్ ప్రమాదం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో ఇప్పుడు దాదాపు వెయ్యి మంది చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టికే 11 మంది మ‌ర‌ణించారు. మొత్తంగా ఐదు గ్రామాల ప్ర‌జ‌ల‌పై ఈ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. ఇక రెండు మూడు రోజుల్లో ఈ ప్ర‌మాద మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

 

మోదీ ఉద‌యం జ‌గ‌న్‌కు ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీయ‌డంతో పాటు కేంద్ర ప్ర‌భుత్వం సాయం ఎప్పుడూ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఇక జ‌గ‌న్ సైతం వెంట‌నే వైజాగ్ చేరుకుని బాధితుల‌ను ప‌రామ‌ర్శిం చ‌డంతో పాటు భారీ ఎత్తు ప‌రిహారం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ ఘటనపై వర్మ సినిమా తీసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఎలాంటి కాంట్ర‌వ‌ర్సీ తో అయినా వ‌ర్మ కు సినిమా తీయ‌డం వెన్న‌తో పెట్టిన విద్య అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 

 

ఈ ఘటనలో పోలీసులు చాలా వేగంగా స్పందించారు అని, అలాగే బాధితులను వాళ్ళు భుజాల మీద మోసుకుని పరుగులు తీసారు అని వాళ్ళ ప్రాణాలను కాపాడిన పోలీసుల ఆధారంగా ఒక 30 నిమిషాల సినిమాను షూట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఆ మాట‌కు వ‌స్తే వ‌ర్మ సినిమాల‌కు క‌థే అక్క‌ర్లేదు. ప్ర‌త్య‌క్ష సంఘ‌ట‌న‌ల‌నే ఆధారంగా చేసుకుని సినిమా తీసేస్తాడు. అంటే ఈ ప్ర‌చారం ప్ర‌కారం వ‌ర్మ వైజాగ్ పోలీసుల‌ను హీరోల‌ను చేయ‌బోతున్నాడు అన్న మాట‌. 

 

ఈ సినిమాకు సంబంధించి తాను కథ రెడీ చేసే అవకాశం ఉందని ఇప్పుడు మీడియా లో ఏ దృశ్యాలు అయితే వస్తాయో వాటినే పూర్తి స్థాయిలో వాడే అవకాశం ఉందని పోలీసుల విలువ తెలిసే విధంగా ఈ సినిమాను ప్లాన్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: