అవును.. నిజం, మహేష్ బాబు, వెంకటేష్ ఇద్దరు కలిసి నటించి మిగితా మల్టి స్టార్ సినిమాలన్నింటికీ ఉపిరిపోశారు. అసలు మల్టి స్టార్ అనేది అందరూ మర్చిపోయారు.. అలాంటిది ఈ సినిమాతో మళ్లీ మల్టి స్టార్ సినిమాలు ఫామ్ లోకి వచ్చాయి. అప్పుడు ఎప్పుడో 1950లో 1960 లో ఎన్టీఆర్.. ఏఎన్ఆర్ కలిసి సినిమాలు చేశారు. 

 

అప్పట్లో వాళ్లిద్దరూ కలిసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 చిత్రాల్లో నటించారు.. ఇంకా ఆ ఆతరవాత నాగార్జున ఏఎన్ఆర్.. నాగార్జున కృష్ణ కలిసి 1980స్ లో, 1990స్ లో యేవో కొన్ని సినిమాలు చేశారు.. ఇంకా ఆ తర్వాత ఎవరు చేశారు.. ఏదో గెస్ట్ గా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రల్లో పవన్ కళ్యాణ్ చేశాడు కానీ మల్టి స్టార్ ఎక్కడ చేశాడు? ఎప్పుడు చేశాడు. 

 

ఇంకా ఆ తర్వాత మల్టి స్టార్ సినిమాలే కరువు అయ్యాయి.. ఆ సమయంలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వచ్చింది.. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు.. విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా మంచి కలెక్షన్స్.. మంచి పేరు సంపాదించింది.. దీంతో ఇంకా అందరూ మొదలు పెట్టారు.. మల్టి స్టార్ లా ఎంతలా మొదలు పెట్టారు అంటే చివరికి రాజమౌళి కూడా మల్టి స్టార్ సినిమా చేసేలా చేశారు..  

 

మల్టి స్టార్ సినిమాలకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఇచ్చిన బూస్ట్ తో మల్లి మన టాలీవుడ్ లో మల్టి స్టార్ సినిమాలు స్టార్ట్ అయ్యాయి..ఈ మధ్యకాలంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఇంకా ఈ మధ్య కాలంలో మరి ఎక్కువ ప్రాజెక్ట్స్ మల్టి స్టార్స్ సినిమాలు రావడం గమనార్హం.                     

మరింత సమాచారం తెలుసుకోండి: