కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. మొదట్లో చాలా తీసుకున్న వారంతా ఈ వైరస్ ధాటికి ప్రజల ప్రాణలని ఎలా కాపాడాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఒకవైపు ప్రజల ప్రాణాలు, మరోవైపు ఆర్థికంగా నష్టాలు.. ఎటూ తేల్చుకోలేని దిక్కుతోచని పరిస్థితిలోకి జారిపోతుంది ప్రపంచం. కొందరు విమర్శకులచే మూడవ ప్రపంచ యుద్ధంగా పరిగణింపబడుతున్న కరోనా వైరస్ వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది..

 

థియేటర్లన్నీ మూతబడడంతో చేసేదేమీ లేక సినిమా విడుదలలన్ని వాయిదా వేసుకున్నాయి. కరోనా బారి నుండి ప్రజల ప్రాణాలని కాపాడుకోవడానికి లాక్డౌన్ ఒక్కటే ఆయుధంగా ప్రభుత్వాలు లాక్డౌన్ ని అమలు చేశాయి. ఈ నేపథ్యంలో జనాలందరూ ఇంటికే పరిమితం కావడంతో వినోదం కోసం డిజిటల్ స్ట్రీమింగ్ ని ఆశ్రయించారు. సినిమాలు, వెబ్ సిరీస్ లు అనే తేడా లేకుండా ప్రతీ దాన్ని చూసేస్తున్నారు.

 

 

చిన్న సినిమా నిర్మాతలు థియేటర్లు తెరుచుకునేంత వరకూ వెయిట్ చేసే ఓపిక లేక అయినకాడిని డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కి అమ్మేసుకుంటున్నారు. అయితే ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లకి పైరసీ సెగలు అంటుకున్నాయి. డబ్బులు పెట్టి చూడాల్సిన కంటెంట్ ఫ్రీగా ఆన్ లైన్లో దొరికేస్తుంది. దాంతో యాజమాన్యాలకి ఇబ్బంది కలుగుతోంది. తాజాగా బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మనోజ్ బాజ్ పాయి నటించిన మిసెస్ సీరియల్ కిల్లర్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ పైరసీ సైట్లలో ఉచితంగా లభిస్తుంది.

 

 

దీంతో నెట్ ఫ్లిక్స్ బాగా నష్టపోతుందట. ఓటీటీలో సూపర్ సక్సెస్ లో దూసుకుపోతున్న ఇలాంటి వెబ్ సిరీస్ లని పైరసీ చేయడం వల్ల నెట్ ఫ్లిక్స్ యాజమాన్యాన్ని బాగా కలవరపెడుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీ యాజమాన్యాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: