కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన ఇండస్ట్రీల్లో చిత్ర పరిశ్రమ కూడా ఒకటి. షూటింగులు లేక ఎందరో ఉపాధి కోల్పోయారు. రోజువారి కూలీల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇలాంటి వారిని ఆదుకోవడానికి కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించి, విరాళాలు సేకరించి వారి ఆకలిని తీరుస్తున్నారు. మూడవ దశ లాక్డౌన్ లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో భవిష్యత్తు మీద ఆశ మొదలైంది. మరికొన్ని రోజుల్లో షూటింగులకి కూడా అనుమతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

అయితే ఈ లాక్డౌన్ సమయంలో ఒక్కో దర్శకుడు ఒక్కో పనిచేస్తున్నారు. చాలా మంది దర్శకులు తమ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని మెరుగుపెట్టేందుకు కృషి చేస్తున్నారు. కొత్త కొత్త కథలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ డైరెక్టర్ తేజ ఒక పక్క వైరస్ గురించి ఆన్ లైన్లో కోర్స్ నేర్చుకుంటూనే, మరోపక్క స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. డైరెక్టర్ తేజ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి.

 

గోపీచంద్ హీరోగా ఆలివేలు వెంకటరమణ సినిమాతో పాటు రానా దగ్గుబాటి హీరోగా రాక్షస రాజ్యంలో రావణాసురుడు అనే సినిమా కూడా ఉందట. అయితే ప్రస్తుతానికి గోపీచంద్ తో సినిమాని పక్కన పెట్టి రానాతో సినిమాని స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట.  అయితే ఈ సినిమాలో ఎక్కువ మందిని కొత్తవారినే తీసుకోవడానికే ప్లాన్ జరుగుతుంది. అందువల్ల ఆన్ లైన్లో ఆడిషన్స్ ని నిర్వహించడానికి సిద్ధం అవుతున్నాడట.

 


కొత్తవారితో మినిమమ్ బడ్జెట్ లో తీస్తున్న మూవీ కావడంతో, ఎక్కువ మంది వర్కర్లు పనిచేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి హ్యాపీగా షూటింగ్ అనుమతి పొందవచ్చు. అదీగాక తేజ స్పీడుకి సినిమా కూడా చాలా తొందరగానే కంప్లీట్ అవుతుంది. దాంతో థియేటర్లు ఓపెన్ అయ్యే సమయానికి సినిమా రెడి అయిపోతుంది. అందుకే ఆన్ లైన్ వేదికగా ఆడిషన్ నిర్వహించి చకచకా సినిమా పూర్తిచేసే ప్లాన్ లో ఉన్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: