ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు వచ్చి తన సత్తా చాటుతూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకూ ఒక్క మల్టీస్టారర్ సినిమా కూడా రాలేదు మెగా ఫ్యామిలీ నుంచి. అయితే ఒక హీరో సినిమాలో  మరో హీరో గెస్ట్ రోల్లో నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఇద్దరు హీరోలు కలిసి మల్టీస్టారర్ గా నటించిన సినిమాలు మాత్రం ఒక్కటి కూడా లేదు. 

 

 

 ముఖ్యంగా మెగా అభిమానులు అందరూ వేయికళ్లతో ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ చిరంజీవి చరణ్ మల్టీస్టారర్. అయితే మగధీర సినిమాలో ఒక సాంగ్ లో  చిరంజీవి స్పెషల్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాలో రామ్ చరణ్  కూడా ఒక సాంగ్ లో ఎంట్రీ ఇచ్చి... తనదైన డాన్స్ తో అదరగొట్టాడు. కానీ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించిన దాఖలాలు మాత్రం లేవు. ఒకరి  సినిమాలో ఒకరు గెస్ట్ రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇద్దరూ మల్టీస్టారర్ సినిమాల్లో నటించి అభిమానులను అలరించిన సినిమాలు మాత్రం లేవు. 

 

 

 దీంతో మెగా  అభిమానులు వీరిద్దరి మల్టీస్టారర్ కోసం తెగ నిరీక్షణ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఒక మల్టీ స్టారర్ కూడా రాకపోవడంతో మొదట చరణ్ చిరంజీవికి సంబంధించిన మల్టీస్టారర్ వస్తే ఎంతో బాగుంటుందని అనుకుంటున్నారు మెగా అభిమానులు. ఒక క్రేజీ డైరెక్టర్ తో చరణ్ చిరంజీవి మల్టీస్టారర్ తెరకెక్కింది అంటే అది నిజంగా మెగా అభిమానులు అందరికీ పండగే అని చెప్పాలి. సంవత్సరం లో ఉన్న అన్ని పండుగలు అన్ని  కలిసి ఒకేసారి వచ్చినట్లు అవుతుంది మెగా అభిమానులకి. చూడాలి మరి మెగా అభిమానుల ఈ మల్టీస్టారర్ కల ఎప్పుడు నెరవేరుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: