90స్ లో చరిత్ర సృష్టించిన సినిమా... కుర్రకారకు వెర్రెత్తించిన సినిమా... మెగాస్టార్ అభిమానులకు కన్నుల పండగ చేసిన సినిమా.. శ్రీదేవిని అతిలోక సుందరిని చేసిన సినిమా.. రాఘవేంద్రుని అద్భుత దృశ్య కావ్యానికి 30 ఏళ్లు నిండబోతున్నాయి.. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ పై అందరి దృష్టి పడింది. జగదేకవీరుడు అతిలోక సుందరి. 1990లో అశ్వినీదత్ నిర్మాతగా దర్శకేంద్రుడు రాఘవేద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన విజువల్ వండర్.  కమర్షియల్ హీరోగా ఇండస్ట్రీని ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి.. బాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీదేవి కలిసి చేసిన ఫాంటసీ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా ముచ్చటగా 30 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. సాధారణ టూరిస్ట్ గైడ్ రాజుగా చిరంజీవి.  ఇంద్రలోకం నుంచి ఉంగరం కోసం దిగివచ్చిన దేవకన్య గా పాలరాతి బొమ్మ శ్రీదేవి నటించారు.

 

జగదేకవీరుడు అతిలోక సుందరి  సినిమా 1990 మే 9న రిలీజ్ అయ్యింది. కొద్దిమంది నటులతో.. ఎక్కువ హడావిడి లేకుండా తెరకెక్కించిన ఈ సినిమా చరిత్రసృష్టించింది. సినిమాతో పాటు పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇన్నేళ్లయినా ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు ఎవర్ గ్రీనే.  . శ్రీదేవిని టాలీవుడ్ ఆడియన్స్ అతిలోక సుందరిగానే పిలవడం స్టార్ట్ చేశారు.  ఈ సినిమాతో చిరంజీవి ఇమేజ్ అమాంతం పెరిగింది. అద్బుతాలను ఎవరూ అనుకుని సృష్టించలేరు..కొన్నికొన్ని అలా జరిగిపోతాయంటూ.. ఆ సినిమా ను తలుచుకుని మురిసిపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

 

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు సీక్వెల్ రావాలని, మెగా ఫ్యామిలీ హీరోలే ఈ సినిమా  చెయ్యాలని  మెగా ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.   ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా సీక్వెల్ పై డిస్కర్షన్స్ నడుస్తున్నాయి.30 యేళ్ళు పూర్తి చేసుకుంటున్న ఈ ఇండస్ట్రీ హిట్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేసుకుంటున్నారు అప్పటి సనిమా నిర్మాత అశ్వనీదత్ . అంతేకాదు ఈ సినిమాకి సీక్వెల్  తీసిన తరువాతే నేను రిటైర్ అవుతానన్నారు నిర్మాత అశ్వీని దత్. దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు.

 

జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి అంత అద్భుతమైన సినిమాను సీక్వెల్ చేస్తే.. హీరో ఎవరూ.. హీరోయిన్ ఎవరైతే బావుంటుందని తెగ ఆలోచిస్తున్నారు అందరూ. ఈ సినిమాను రామ్ చరణ్ హీరోగా సీక్వెల్ చేస్తే చూడాలని ఉందని..మెగాస్టార్ ఎప్పుడో చెప్పేశారు. ఇక హీరోయిన్ గా అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ నటిస్తే.. బాగుంటుందని కూడా చిరంజీవే చెప్పారు. ఇక ఆ సీక్వెల్ ను కరెక్ట్ గా హ్యాండిల్ చేయగిలిన డైరెక్టర్ కోసం కూడా చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: