2012 లో విడుదలైన 'ఓహ్! మై గాడ్' అనే హింది మూవీకి గోపాల గోపాల్ రీమేక్ కాగా... అందులో పవన్ కళ్యాణ్, వెంకటేష్, శ్రియ శరన్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో వెంకటేష్ గోపాల రావు అనే ఓ నాస్తికుడు పాత్రలో నటించగా... ఆయన హిందూ దేవుళ్ళ విగ్రహాలను విక్రయిస్తుంటారు. ఐతే ఒకానొక సమయంలో భూకంపం రావడంతో తన విగ్రహాల షాపు నేలమట్టం అవుతుంది.


దీంతో గోపాల్ రావు ఇన్సూరెన్సు కోసమని ఆఫీస్ కి వెళితే అక్కడ అధికారులు భూకంపం అనేది దేవుడు వలన సంభించిన విపత్తు అని, అందుకే ఇన్సూరెన్సు రాదు అని చెప్తారు. దాంతో చేసేదేమి లేక తనకు జరిగిన నష్టాన్ని దేవుడే చెల్లించాలని గోపాలరావు దేవుడిపై కేసు వేస్తాడు. ఆ తర్వాత అతనిపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలోనే గోపాల గోవిందా హరి అనే కన్సల్టెంట్ గోపాలరావు కి సహాయం చేస్తాడు. వాస్తవానికి పాప గోవిందా హరి ప్రదేశంలో వచ్చింది విష్ణు దేవుడని ప్రేక్షకులకు సినిమా గడుస్తున్నకొద్దీ తెలుస్తుంది. అయితే ఈ విష్ణు పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించాడు. పవన్ కళ్యాణ్ సినిమా తెలుగులో ఇటువంటి పాత్రలో నటించడం మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు.


గోపాల గోపాల సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కడం అందులో పవన్ కళ్యాన్ నటించడం అప్పట్లో సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర అంశంగా మారింది. విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాల్లో నటించడం ఇదే మొదటిసారి కాదు. కానీ పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. సెటైరికల్ కామెడీ డ్రామా ఫిలిం గా తెరకెక్కిన గోపాల గోపాల తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 2015 సంవత్సరంలో రిలీజ్ అయిన గోపాల గోపాల చిత్రం 32 కోట్ల బడ్జెట్ తో రుపొందగా... బాక్సాఫీస్ వద్ద 66 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: