తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి అన్న విషయం తెలిసిందే.ముఖ్యంగా సీనియర్ హీరోలు యువ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇలా మల్టీస్టారర్ సినిమాలకు ఎక్కువ బెనిఫిట్ కూడా ఉంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. మల్టీస్టారర్ సినిమాల ద్వారా ఇద్దరు హీరోల అభిమానుల నుండి ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తుందని దర్శకనిర్మాతలు కూడా అనుకుంటున్నారు. దీంతో మల్టీస్టారర్ సినిమాల తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. 

 

 

 ఈ క్రమంలోనే ఓ సీనియర్  హీరో ఓ యువ  హీరో  కాంబినేషన్లో తెరకెక్కిన మల్టీస్టారర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలైంది. సినిమాలో అంతా బాగానే ఉంది.. కానీ ఎక్కడో తేడా కొట్టేసింది... ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది ఆ సినిమా . దీంతో ప్రేక్షకులకు అటు దర్శక నిర్మాతలకు నిరాశ ఎదురైంది. ఇంతకీ ఆ సినిమా ఏది అనుకుంటున్నారా అక్కినేని నాగార్జున నాచురల్ స్టార్ నాని హీరోలుగా మల్టీస్టారర్గా తెరకెక్కిన చిత్రం దేవదాసు. ఈ సినిమాలో మాస్ యాక్షన్ తో  నాగార్జున... నాచురల్ యాక్టింగ్ తో నాని అదరగొట్టినప్పటికీ ఎందుకో  ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 

 

 

 ఇక ఈ సినిమాలో కామెడీ కూడా అంతా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించినప్పటికీ... ఈ సినిమా విజయం మాత్రం సాధించలేకపోయింది. దీంతో మొదటి సారి నాగార్జున నాని కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా బెడిసి కొట్టింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా ఇద్దరికీ మొదటి మల్టీస్టారర్ సినిమానే . నాగార్జున ఇప్పటివరకు యువ హీరోలతో మల్టీ స్టారర్ చేసింది లేదు. అలాగే నాని కూడా ఇప్పటివరకు మల్టీస్టారర్ సినిమాల జోలికి వెళ్ళలేదు. కానీ ఈ ఇద్దరు హీరోలకు మొదటి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: