రూలర్ తర్వాత బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన రూలర్ మువీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది. పాతకాలం నాటి కథతో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తిరస్కరించారు. యువ చిత్ర దర్శకులతో, సరికొత్త కథాంశాలతో తెలుగు చిత్రపరిశ్రమ దూసుకుపోతుంటే, రూలర్ వంటి మూవీ బాలయ్య ఏ విధంగా ఒప్పుకున్నాడన్న సందేహాలు వ్యక్తం చేశారు.

 

 

అయితే బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రస్తుత చిత్రంలో బాలయ్య చాలా బాగా కనిపిస్తాడట. ఇప్పటి వరకు మనం చూడని విభిన్నమైన లుక్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరుస్తాడట. పదేళ్ల క్రితం బాలయ్య ఎలాంటొ ఫేజ్ లో ఉన్నాడో, ఇప్పుడు కూడా అలాంటి ఫేజ్ లోనే ఉన్నాడు. వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్న బాలయ్యకి సింహా రూపంలో బ్లాక్ బస్టర్ వచ్చింది. ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

 

 


ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమా మరో బ్లాక్ బస్టర్. ఈ సినిమాతో బాలయ్య క్రేజ్ మరింత పెరిగింది. అయితే ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సినిమాపై అభిమానులు బాగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో దర్శనమివ్వనున్నాడట. ఫ్లాష్ బ్యాక్ లో అఘోరా పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఈ పాత్ర కోసమే తన హెయిర్ స్టైల్ ని మార్చుకున్నాడని ప్రచారం జరుగుతుంది.

 

అదీ గాక ఈ పాత్రని బాగా అధ్యయనం చేస్తున్నాడట. అఘోరాలు ఎలా ఉంటారన్న దగ్గరి నుండి వారి అలవాట్లు, ఎలాంటి పరిస్థితిలో ఎలా బిహేవ్ చేస్తారన్న దగ్గరి నుండి బాగా నిశితంగా స్టడీ చేస్తున్నాడట. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా కొత్త అమ్మాయి కనిపించనుంది. లాక్డౌన్ పూర్తవగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: