ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహామారి ప్రజలను అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా సహాయ చర్యలు ప్రజలకు అండగా నిలుస్తుంది. అలాగే మరోవైపు పేదలకు సహాయంగా నిలుస్తూ వాళ్ల మానవత్వాన్ని చాటుకుంటున్నారు తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు. ఇండస్ట్రీలో చిన్న, పెద్ద హీరో అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వారి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఈ క్రమంలో సినీ కార్మికుల కోసం, రెండు రాష్ట్రాల పేద ప్రజల కోసం ఆర్థిక సహాయం అందించిన ఎన్టీఆర్ మరోసారి తన సొంత స్టాఫ్ కొరకు సహాయం అందజేశారు. 

 


ఇక తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ తన సొంత స్టాఫ్ అందరి కోసం ప్రత్యేకంగా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా స్టాఫ్ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారికి అడ్వాన్స్ గా జీతాలు కూడా ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే తన స్టాఫ్ ఎవరూ కూడా ఆకలితో ఇబ్బంది పడకూడదని ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిన మీ అందరికీ నేను భరోసా ఇస్తాను అని ఎన్టీఆర్ తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు ఎన్టీఆర్ మంచి మనసుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 

 

ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక చిత్రమైన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే ఆర్ఆర్ఆర్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తీయడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరు CCC సంస్థను ఏర్పాటు చేసి సేవలను అందిస్తున్నాడు. అలాగే యువ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒక చైనా ట్రస్ట్ లాంటిది మొదలుపెట్టి సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీరే కాకుండా ఎవరికీ వారు తోచినంత సేవ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: