మొదటి సినిమాతో నిర్మాతగా ప్రశంసలు అందుకున్న నాని రెండో సినిమా తో కమర్షియల్ 'హిట్' కూడా  కొట్టాడు. తన స్నేహితురాలు ప్రశాంతి త్రిపురనేని తో కలిసి నాని నిర్మించిన చిత్రం హిట్. ఈఏడాది ఫిబ్రవరి లో విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్ తో హిట్  అనిపించుకుంది. ఇక ఇటీవల ఈసినిమా ను అమేజాన్ ప్రైమ్ డిజిటల్ రిలీజ్ చేయాగా అందులో కూడా సూపర్ రెస్సాన్స్ ను రాబట్టింది. అయితే బుల్లితెర పై మాత్రం హిట్ ఆశించిన స్థాయిలో రేటింగ్స్ ను రాబట్టలేకపోయింది. మేడే రోజున  జెమిని టీవి ఈ సినిమా ను తొలిసారి ప్రదర్శించగా కేవలం 5.07(రూరల్ +అర్బన్) టీఆర్పీ ని మాత్రమే రాబట్టింది. రూరల్ లో పట్టించుకోలేదు కానీ అర్బన్ లో మాత్రం 7.23 టీఆర్పీ తో పర్వాలేదనిపించింది. డిజిటల్ లో విడుదలైన కొద్దీ రోజుల్లోనే టీవి లోకి రావడంతో  జనాలు మళ్ళీ ఈసినిమాను చూడడానికి ఆసక్తిని చూపించలేదు.
 
యంగ్ హీరో విశ్వక్ సేన్, రుహాణి శర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శైలేష్ కొలను తెరకెక్కించగా వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుందని సమాచారం. వచ్చే ఏడాది హిట్ 2 సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు వున్నాయి. ఇక హిట్ బాలీవుడ్ లో రీమేక్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలావుంటే శైలేష్ తన తదుపరి చిత్రాన్ని నాని తో చేయాలని ప్లాన్ చేసుకుంటుండగా వరస పరాజయాల తరువాత ఎట్టకేలకు హిట్ తో కెరీర్ లో మొదటి హిట్ కొట్టిన విశ్వక్ సేన్  పాగల్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు.  నరేశ్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం జులై నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్ నిర్మించనున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: