టాలీవుడ్ లో ట్రెండ్ కి తగ్గట్టుగా హిట్ సినిమాలతో దూసుకుపోతున్న యువ నటుడు ఎన్టిఆర్. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ ని జాగ్రత్తగా మలుచుకుంటున్నాడు. సినీ రంగంలో తన కంటూ  ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాగే సేవా కార్యక్రమాల తోను ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నాడు. ఎన్టిఆర్ సినిమా అంటే యూత్ కి నిద్ర కూడా పట్టదు. ఎప్పుడు అన్న సినిమా వస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మరీ ఎన్టిఆర్ సినిమా చూస్తారంటే అతిశయోక్తి కాదు. 

 

ఎన్టిఆర్ కోసం ప్రముఖ దర్శక, నిర్మాతలు కూడా క్యూ లో ఉంటారు. ఎన్టిఆర్ తాజాగా ఆర్.ఆర్.ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్నట్టు తెలిసిన సంగతే. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా త్రివిక్రమ్ సిద్దం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్స్ కనపడుతుంది. ఇక త్రివిక్రమ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఎన్టిఆర్ సినిమా ఉంటుందని వార్తలు ఇప్పుడు సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

 

వీరి కాంభోలో సినిమా ఉంటుందో లేదో ఇంకా అధికారికంగా బయటికి రాలేదు. కాని ఈ సినిమా గురించి రకరకాల వార్తలు సినీ పరిశ్రమలో ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుందనే వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టిఆర్ డిఫరెంట్ లుక్ తో చాలా పవర్ ఫుల్ పాత్రలో కనపడతారని సినీ జనాల కథనం. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రావటానికి చాలా సమయం పడుతుందని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ పై ఉన్న నమ్మకం తో ఎన్టిఆర్ ఆయన కథకు డేట్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమో అనేది తెలియాల్సి ఉంది. దీని గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: