త్రిష వంటి హీరోయిన్ లకు మన తెలుగులో ముందు నుంచి కూడా మంచి డిమాండ్ ఉంది. మన తెలుగులో ఆమె దాదాపు అందరు స్టార్ హీరోలతో మంచి సినిమాలు చేసింది. చిన్న చిన్న హీరోలతో మినహా దాదాపు అందరు హీరోలతో ఆమె సినిమాలు వచ్చేసాయి. ఇక ఇప్పుడు ఆమె వయసు మీద పడుతున్నా సరే టాలీవుడ్ లో ఆమెకు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు అనేది టాలీవుడ్ జనాల మాట. ఆమెకు ఆఫర్ ఇవ్వడానికి ఇప్పటికి కూడా కొందరు హీరోలు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. 

 

చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చింది. అయినా సరే కొన్ని కారణాలతో ఆమె దూరంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆమె చిరంజీవి తో సినిమా చేయడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం. ఆచార్య సినిమాలో నటించడం కుదరదు కాబట్టి తర్వాత వచ్చే లూసిఫర్ సినిమాలో ఆమె చేయడానికి ఆసక్తి చూపిస్తుంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఆమె ఏ సినిమాలో చేస్తుంది అనేది చూడాలి. చిన్న చిన్న హీరోల సినిమాల్లో ఆమెకు కీలక పాత్రలు చేసే అవకాశం వస్తున్నా సరే ఆమె మాత్రం ముందుకు రావడం లేదు. 

 

అగ్ర హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చినా సరే ఆమె మాత్రం చాలా ఆలోచించి తనకు ఉపయోగం ఉంది అనుకుంటే మాత్రమే సినిమా చేస్తుంది గాని లేకపోతే సినిమా చేయడానికి ముందుకు రావడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మహేష్ పరుశురాం దర్శకత్వంలో వచ్చే సినిమాలో కూడా ఆమెకు మంచి ఆఫర్ వచ్చినా సరే ఆమె మాత్రం సినిమా చేయడానికి ముందుకు రాలేదు. కాని చిరంజీవి సినిమాలో చేస్తా అని ఆమెనే స్వయంగా దర్శక నిర్మాతలను అడిగినట్టు సమాచార౦. మరి చేస్తుందో లేదో...

మరింత సమాచారం తెలుసుకోండి: