ఈ మధ్య కాలంలో మన తెలుగులో హీరోయిన్ లకు డిమాండ్ అనేది ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న హీరోల సినిమాలకు కూడా హీరోయిన్ లు సరిగా దొరకడం లేదు అనేది వాస్తవం. చిన్న హీరోల సినిమాలకే కాదు పెద్ద హీరోల సినిమాలకు కూడా హీరోయిన్ లు దొరకడం లేదని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రస్తుతం మన తెలుగులో కొన్ని సినిమాలకు కొంత మంది హీరోయిన్ లను మాత్రమే ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రష్మిక మంధన, పూజ హెగ్డే వంటి హీరోయిన్ లకు ఇప్పుడు మన తెలుగులో మంచి డిమాండ్ ఉంది. 

 

వీరికి పారితోషికం కూడా ఎక్కువగానే ఇస్తున్నారు. అయితే ఇప్పుడు వీరు ఇద్దరినీ పక్కన పెట్టే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు. వీరికి అవకాశం ఇవ్వాలని చూసినా సరే ఇద్దరూ కూడా అనవసరంగా తమ డిమాండ్ ని ఎక్కువగా ఊహించుకుని ఏది పడితే అది మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అందుకే వీరి ఇద్దరినీ ఇక పక్కన పెట్టడమే మంచిది అనే భావన లో దర్శక నిర్మాతలు ఉన్నారని టాలీవుడ్ లో ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. చిన్న చిన్న పాత్రలకు కూడా వీళ్ళు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. 

 

వీరిద్దరి తో కలిసి సినిమా చేయడం అనేది ఇప్పుడు చాలా పెద్ద ఇబ్బంది గా మారింది హీరోలకు కూడా. తమ తో సినిమా చేయడం అంటే అంత సులభం కాదు అని చెప్తున్నారు ఈ ఇద్దరు. అగ్ర హీరోల సినిమాలకు కూడా భారీగా డిమాండ్ చేస్తున్నారు. మొన్నటి వరకు లక్షల్లో అడిగిన ఈ ఇద్దరు ఇప్పుడు కోట్ల వరకు ఆలోచన చేయడం చాలా మందికి నచ్చడం లేదు. అందుకే ఇప్పుడు ఈ ఇద్దరినీ పక్కన పెట్టడమే మంచిది అనే భావన లో తెలుగు సినిమా ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: