టాలివుడ్ లో 90 లలో నటించిన కథానాయికలలో ఒకరు అందాల తార రాశి. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. బాల నటిగా సినీ రంగంలో అడుగు పెట్టి కథానాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత చూడాలని ఉంది, మా అఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి సినిమాలలో దాదాపు 30 సినిమాల్లో హీరోయిన్ గా అగ్ర హీరోల సరసన నటించింది. పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్ లతో ఒక ఊపు ఊపింది. తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉన్నారు.

 

తాజాగా ఇప్పుడు రాశి తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనుంది. ఈ నేపధ్యంలో ఒక మీడియా ఇంటర్వ్యూ లో బాలకృష్ణ పై హాట్ కామెంట్స్ చేసింది. ఆమె బాల గోపాలం సినిమాలో బాల నటిగా బాలకృష్ణ తో నటించింది. అయితే ఆ సినిమాలో తనతో పాటు కళ్యాణ్ రాం కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారని గుర్తు చేసుకున్నారు. అయితే హీరోయిన్ గా మళ్ళి బాలకృష్ణ హీరోగా వచ్చిన కృష్ణ బాబు సినిమాలో అవకాశాన్ని అందుకుంది. అయితే బాల కృష్ణ దూకుడు, దురుసు ప్రవర్తనకి కృష్ణ బాబు సినిమా షూటింగ్ సమయంలో చాలా భయమేసిందని చెప్పింది. 

 

అయితే బాల కృష్ణ తనను ఎలా యాక్సెప్ట్ చేస్తారో అని అనుకున్నానని చెప్పుకొచ్చింది. తను షూటింగ్ కి వెళ్లే సరికి బాలయ్య సెట్ లో ఉండేవారని తనని మంచిగా రిసీవ్ చేసుకున్నారని గుర్తు చేసుకుంది. బయటి వ్యక్తులకు బాలయ్యని చూస్తే చాలా భయంగానే ఉండేదని, అయితే ఆయనతో కలిసి పని చేసే వారికి మాత్రం ఆయన మంచితనం తెలుస్తుందని చెప్పింది. అయితే రాసి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాశి వెబ్ సిరిస్ లలో కూడా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: