టాలీవుడ్ బుల్లి తెర మీద అనసూయ ఏ స్థాయిలో ప్రభావం చూపించింది అనేది అందరికి తెలిసిన విషయమే. జబర్దస్త్ అనే టీవీ షో ద్వారా ఆమె ఒక రేంజ్ లో పాపులర్ అయింది. ఇక అక్కడి నుంచి ఆమె సినిమాల్లో కూడా అప్పుడప్పుడు కనపడుతుంది కూడా. కొన్ని పెద్ద పెద్ద సినిమాల్లో ఆమెను తీసుకునే ప్రయత్నాలను దర్శక నిర్మాతలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమెకు మంచి ఆదరణ కూడా ఉంది. అగ్ర హీరోల సినిమాల్లో కూడా ఆమెకు మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. చిన్న చిన్న హీరోల సినిమాల్లో విలన్ గా ఆఫర్లు వస్తున్నాయి. 

 

సినిమాలు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆమె సినిమాలు చేస్తున్నారు. అగ్ర హీరోల సినిమాలు చేస్తే ఆమెకు కీలక పాత్రలే వస్తున్నాయి గాని చిన్న చిన్న పాత్రలు అనేవి రావడం లేదు. ఆమె కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు ఆమెకు కొన్ని ఆఫర్లు వస్తున్నాయి అని సమాచారం. ఆఫర్లు ఏంటీ అంటే ఆమెకు సీరియల్స్ లో నటించాలని అవి కూడా హింది సేరియల్స్ అని హింది సీరియల్స్ లో హీరోయిన్ గా ఆమెకు ఆఫర్ వచ్చినట్టు సమాచారం. 

 

అయితే ఎక్కువ రోజులు ఆ సీరియల్స్ షూటింగ్ జరిగే అవకాశం ఉండదు అని ఈమె పాత్ర చాలా తక్కువగా ఉంటుంది అని నిర్మాతలు చెప్తున్నారు. ఆమెకు అవకాశం ఇచ్చింది కేవలం కొంత వరకు మాత్రమే అని ఆమె ఎక్కడికో వెళ్లిపోవడమో చనిపోవడమో సీరియల్ లో ఉంటుంది అని వివరించినట్టు సమాచారం. ఆమె అందుకు ఓకే చెప్పిందఅని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఆమె నితిన్ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: