టాలీవుడ్ లో చిరంజీవి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు ప్రేక్షకులు చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన సినిమాలకు ఉండే మార్కెట్ కూడా ముందు నుంచి భారీగా ఉంటుంది. చిన్న చిన్న సినిమాలు అయితే ఆయన సినిమా ఉంటే పక్కన పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అనేది వాస్తవం. ఆయన సినిమాల కోసం దర్శక నిర్మాతలు కూడా ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనే విధంగా ఎదురు చూస్తారు అనేది వాస్తవం. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. 

 

సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం చిరంజీవి బాగా కష్టపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నారు కాబట్టి ఆచార్య సినిమా షూటింగ్ లేట్ అవకాశాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది అని సమాచారం. ఆచార్య సినిమా కోసం చిరంజీవి అడిగినా సరే రామ్ చరణ్ ని పంపడానికి గానూ దర్శకుడు అంగీకరించలేదు అని సమాచారం. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు చిరంజీవి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

 

ఆయన ఒక యువ దర్శకుడికి అవకాశం ఇచ్చినట్టు సమాచారం. అనీల్ రావిపూడి తో సినిమా చేయడానికి చిరంజీవి రెడీ అయ్యారు. అనీల్ రావిపూడి తో సినిమా చేస్తా అని చిరంజీవి ఎప్పుడో చెప్పారట. చిరంజీవి ఆఫర్ ఇవ్వడం తో అనీల్ కథ ను కూడా రెడీ చేస్తున్నట్టు సమాచారం. అతను ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాలో బిజీ గా ఉన్నాడు. లాక్ డౌన్  లో సమయం దొరకడం తో అతను ఇప్పుడు కథను రెడీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: