అల్లు అర్జున్..స్టైలిష్ స్టార్. ఆయన తాజాగా సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో సూపర్ హిట్ తో యమ జోరు మీద ఉన్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తరువాత తరువాత సినిమాని సుకుమార్ డైరెక్షన్లో లైన్లో పెట్టేశాడు. లాక్ డౌన్ పూర్తి అయితే ఆ సినిమా పట్టాలెక్కుతుంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తీయాలని అల్లు అర్జున్ ఫిక్స్ అయ్యాడని అంటున్నారు.

 

ఇదిలా ఉండగా టాలీవుడ్లో టాప్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ నంబర్ వన్ సీట్ కోసం తన వంతు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. ఆయన గతంలో మాదిరిగా ప్రయోగాలకు స్వస్తి చెప్పి హిట్ ఫార్ములాతో దూసుకుపోవాలని, అదే విధంగా వరస హిట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడని అంటున్నారు.

 

ఇక సంక్రాంతి మూవీగా వచ్చిన అల వైకుంఠపురంలో కలెక్షనల్లో నంబర్ వన్ గా నిలిచింది. ఇక మిగిలిన టాప్ హీరోలను కూడా ఆ విధంగానే నెట్టేస్తూ దూసుకుపోవాలని అల్లు అర్జున్ పక్కా ప్లాన్ తో ఉన్నాడుట. అంతే కాదు, అల్లు అర్జున్ కి మాలీవుడ్లో కూడా డిమాండ్ ఉంది. దాంతో కోలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది.

 

దాంతో వీటిని మరింతగా పదును పెట్టుకుని సౌత్ ఇండియా సూపర్ స్టార్ కావాలని అల్లు అర్జున్ అదిరిపోయే ప్లాన్ వేస్తున్నాడని అంటున్నారు. మొత్తానికి అల్లు వారి అబ్బాయి తలచుకుంటే ఏదైనా సాధిస్తాడని అంటున్నారు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఒక తెలుగు హీరో ఉంటే కనుక అది తెలుగు వారికి గర్వకారణమే కదా. సో. అలాగే కానీయ్ అల్లు అర్జున్ అంటున్నారంతా.

 

దానికి నాందిగా పుష్ప సినిమాతో తన లక్కుకి బన్నీ పరీక్ష పెట్టుకుంటున్నాడని కూడా అంటున్నారు. అల్లు అర్జున్ కెరీర్ చూస్తే ఒక పధ్ధతి ప్రకారం ఎదుగుతూ వచ్చిన తీరు కనిపిస్తుంది. సో అల్లు అర్జున్ తన టార్గెట్ రీచ్ కాగలడు అని అంతా అంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: