రామ్ పోతినేని 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో మంచి జోష్ మీదున్నాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు రామ్ కెరీర్లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు మాస్ చిత్రాలను టచ్ చేయని చాక్లెట్ బాయ్ రామ్.. ఫస్ట్ టైం ఫుల్ మాస్ లుక్‌ లో అదరగొట్టేశాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఆ సినిమా రామ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు 75 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి నిర్మాతలు ఛార్మి, పూరి జగన్నాథ్ లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసిన రామ్ పోతినేని వెంటనే క్రైమ్ థ్రిల్లర్ 'రెడ్' సినిమాను పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఏప్రిల్‌ లో రిలీజ్ కావలసిన ఈ చిత్రం లాక్‌ డౌన్ కారణంగా వాయిదా పడింది. వరుసగా చాక్లెట్ బాయ్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్న రామ్ ఈ రెండు సినిమాలతో అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్ లో కనిపించాడు.

 

ఇప్పటికే విడుదలైన 'రెడ్' టీజర్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఈ మూవీ నుండి ‘నువ్వే నువ్వే’ అనే సాంగ్ మేకింగ్ వీడియోని రేపు సాయంత్రం 5:15 నిమిషాలకు విడుదల చేస్తారట. ఈ మేరకు చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేశారు. చైర్ లో ఉన్న రామ్ ఒడిలో హీరోయిన్ అమ్రితా అయ్యర్ కూర్చున్న రొమాంటిక్ పోజ్ బాగుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నివేదా పేతురాజ్ నటిస్తుండగా హెబ్బా పటేల్ గెస్ట్ రోల్ చేస్తుంది. ఈ చిత్రంలో రామ్ మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. 'రెడ్' లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత విడుదల కానుంది. ఈ మధ్య రామ్ 'రెడ్' సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ లో రిలీజ్ చేస్తున్నారనే వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. కాగా 'రెడ్' సినిమాని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై 'స్రవంతి' రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళ మూవీ 'తడమ్' సినిమా ఆధారంగా రూపొందింది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఫలితాన్ని పొందబోతుందో తెలియాలంటే రామ్ చెప్పినట్టు థియేటర్లలో రిలీజయ్యే దాకా వెయిట్ చేయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: