తెలుగు సినిమా ప్రస్తుత జనరేషన్ లో క్రియేటివ్ దర్శకుడు ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం ‘సుకుమార్’ అనే. తన క్రియేటివ్ థింకింగ్ కు ఉదాహరణగా నిలిచిన సినిమాలు ఉన్నాయి. స్వతహాగా లెక్కల మాస్టారు అయిన సుకుమార్ అదే ఫార్ములా క్రియేటివ్ గా సినిమా భాషలో అప్లై చేస్తూంటాడు. సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా తన రైటింగ్స్ తో కొన్ని సినిమాలు నిర్మిస్తున్నాడు కూడా. ఇప్పుడు తనలోని ఆ రైటింగ్ టెక్నిక్కే ఉపయోగించి తన స్నేహితుడి గురించి ఓ ఉత్తరం రాశాడు.

 

 

ఇద్దరు స్నేహితులు ఎదురెదురుగా ఉండి మాట్లాడుకున్నట్టే ఆ లేఖలో తన స్నేహితుడి కుశలాన్ని కోరుకున్నాడు. తన స్నేహితుడు, మేనేజర్ ప్రసాద్ ఇటివల కాలం చేశాడు. తనతో ఎంతో స్నేహం ఉన్న సుకుమార్ అప్పట్లోనే ఎంతో బాధ అనుభవించినట్టు చెప్పుకున్నాడు. ఈరోజు ప్రసాద్ జయంతి కావడంతో తన మనసులోని భావాలను స్నేహితుడిపై ఉన్న చనువును తన రాతతో జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతో ఆత్మీయతలో అంతకుమించి భావుకతతో తన స్నేహితుడితో ఉన్న అనుబంధాన్ని రాసుకున్నాడు. బావా.. అంటూ తమ ఇద్దరి మధ్య స్నేహాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు చెప్పుకుంటారో అవన్నీ ఆ లేఖలో ప్రస్తావించాడు సుకుమార్.

 

 

ఇంతటి లాక్ డౌన్ లో కూడా బయట స్వేచ్ఛగా ప్రసాద్ విహరిస్తున్నాడని సుకుమార్ రాయడం వారి స్నేహాన్ని తెలియజేస్తోంది. అంతరించిపోయిన ఉత్తరాల్లోని మాధుర్యాన్ని గుర్తు చేస్తూ పక్క ఊరిలోనే ఉన్న తన స్నేహితుడి క్షేమాన్ని కోరుతూ రాసినట్టు ఆ ఉత్తరాన్ని రాశాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కెరీర్ పరంగా సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లాక్ డౌన్ పరిస్థితుల అనంతరం ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Happy Birthday my dear friend Prasad.

A post shared by sukumar B (@aryasukku) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: