భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరు. టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని అందరు నటీనటులు కోరుకుంటాడు. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆయన డైరెక్షన్లో వర్క్ చేయాలని ఆశపడుతుంటారు. జక్కన్న తన ఆలోచలను సినిమాలుగా మలిచి విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తుంటాడు. 'బాహుబలి' చిత్రాలతో మన తెలుగు చిత్రాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకొనిపోయాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్య నార్త్ ఇండియన్స్ మన జక్కన్నని ఒక ఎపిక్ సినిమాకి డైరెక్షన్ చేయమని సోషల్ మీడియాలలో నేషనల్ వైడ్ ట్రెండ్ స్టార్ట్ చేశారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘రామాయణం’ను రీమేక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. #RajamouliMakeRamayan హ్యాష్ ట్యాగ్‌ తో ప్రస్తుతం ‘రామాయణం’ మహాకావ్యాన్ని తెరపై ఆవిష్కరించగల ఏకైక దర్శకుడు రాజమౌళి అని కీర్తిస్తున్నారు. ఆయన తప్ప ఇండియాలో మరో దర్శకుడు రామాయాణాన్ని అంత గొప్పగా తెరకెక్కించలేరని కితాబిస్తున్నారు. 

 

రాజమౌళి ఇప్పటివరకు ఫాంటసీ, పీరియాడిక్ మరియు మాస్ యాక్షన్ ఎంటెర్టైనర్స్ అన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ హిస్టారిక్ పాత్రలకు ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ - కొమరం భీమ్, చరణ్ - అల్లూరి పాత్రలు చేస్తుండగా పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో విడుదల కానుంది. ఇక రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం అని ఆయన అనేక సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఆ సినిమా తీయడానికి ప్రస్తుత నా అనుభవం చాలదని బాహుబలి చిత్రానికి ముందు చెప్పారు. ఐతే తనకు రామాయణం పై ఎందుకు ఆసక్తి లేదో రాజమౌళి చెప్పారు. రాముడు మంచి వారు మరియు సాఫ్ట్ నేచర్ కలిగి ఉండడం వలన ఓ మాస్ హీరోకి ఉండే క్వాలిటీస్ ఆయనకు లేవు అన్నారు. కృష్ణుడు విషయంలో హీరోయిన్ ఇజం ఎలివేషన్ చేసుకోవచ్చు అన్నారు. కారణం ఏదైనా రాజమౌళి మాత్రం రామాయణం తీయను అని ప్రత్యక్షంగా చెప్పేశారు. అంటే జక్కన్న దర్శకత్వంలో రామాయణం తెరకెక్కే అవకాశం లేదని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: