నివేదా థామస్ తెలుగు, తమిళం, మళయాళం లో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. krishna INDRAGANTI' target='_blank' title='ఇంద్రగంటి మోహనకృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన జెంటిల్ మాన్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది నివేదా థామస్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో అందరి దృష్ఠి నివేదా మీద పడింది. ఈ సినిమా తర్వాత నిన్ను కోరి, జై లవ కుశ, 118, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, బ్రోచేవారెవరురా సినిమాలలో హీరోయిన్ గా నటించింది. వీటిలో దాదాపు సినిమాలన్ని సూపర్ హిట్ గా నిలిచినవే. అయితే వరసగా మాత్రం స్టార్ హీరోల సినిమాలలో అవకాశం రాకపోవడం పెద్ద మైనస్ గా చెప్పాలి. అందుకు కారణం నివేదా పద్దతిగా నటించాలనుకోవడమే.  

ఎక్స్‌ఫోజింగ్, హీరోలతో రొమాన్స్ కి నివేదా నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. దాంతో నివేదా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కాలేకపోతుంది. ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం సరసన నటించినప్పటికి పెద్ద ప్రాజెక్ట్స్ లో అవకాశాలు దక్కడం లేదు. కాకపోతే ఇది హీరోయున్ గా మాత్రమే. సీనియర్ స్టార్స్ సినిమాలలో మాత్రం నివేదా కి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
రీసెంట్ గా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ ప్రాజెక్ట్ దర్బార్ లో నటించింది నివేదా. అయితే రజనీకాంత్ సినిమాలో నటించిందన్న పేరేగాని ఈ సినిమా ఈ అమ్మడికి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్ లోనూ నివేదా ఒక కీలక పాత్ర పోషిస్తుంది. 

 

ఈ పాత్ర పవన్ కళ్యాణ్ తర్వాత అంత ఇంపార్టెంట్ రోల్. ఇదే పాత్రని హిందీలో తాప్సీ నటించి మంచి పేరు సంపాదించుకుంది. చెప్పాలంటే ఈ పాత్రతో తాప్సీకి బాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన సినిమాలలో మంచి మంచి అవకాశాలను అందుకుంటుంది. అయితే ఇలాంటి పాత్రలు ఒప్పుకొని నివేదా థామస్ తప్పు చేస్తుందా అని కొంతమంది మాట్లాడుకుంటున్నారట. ఇక హీరోయిన్ గా అవకాశాలు వస్తాయా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారట. ఇక ప్రస్తుతం మరోసారి నాని నటిస్తున్న ఇంద్రగంటి మోహన కృష్ణ వి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: