ఎనభై, తొంభై దశకాల్లో చిరంజీవి ఫైట్స్, బ్రేక్ డ్యాన్సులకు రాష్ట్రమంతా హోరెత్తిపోయేది. ఆ దశలో చిరంజీవి స్థాయిని, మాస్ ఇమేజ్ ను ఎవరెస్ట్ శిఖరమంత స్థాయికి చేర్చిన సినిమా ‘గ్యాంగ్ లీడర్’. సినిమాలో చిరంజీవి స్టైల్ కు, డ్యాన్సులకు, ఫైట్లకు ఓ మ్యానియానే కొనసాగింది. ఈ సినిమా విడుదలై నేటితో 29 ఏళ్లు పూర్తయ్యాయి. శ్యాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై మాగంటి రవీంద్రనాధ్ చౌదరిసినిమా నిర్మించారు. విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1991 మే9న విడుదలైంది.

IHG

 

సినిమాలో చిరంజీవి మేకోవర్ కు స్పెషల్ క్రేజ్ క్రియేట్ అయింది. మాసిన గడ్డం, రఫ్ లుక్, షర్ట్ పై బటన్ తీసేయడం, షర్టు కాలర్ వెనక్కు వేయడం.. వంటి చిరంజీవి స్టైల్స్ కు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగులు సినిమాకు ప్లస్ అయ్యాయి. ‘చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో.. రఫ్పాడించేస్తాను’ అని చిరంజీవి చెప్పిన డైలాగ్ పేలిపోయింది. విజయశాంతి హీరోయిన్ గా సరిజోడుగా నిలిచింది. బప్పీలహరి సంగీతం సినిమాకు ప్రాణం. అన్ని పాటలు చార్ట్ బస్టర్సే. టైటిల్ సాంగ్ లో డ్యాన్సులతో చిరంజీవి సంచలనమే సృష్టించారు.

IHG

 

ఓపెనింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో ఆ ఏడాదికి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరంజీవి ఒన్ మ్యాన్ షోతో గ్యాంగ్ లీడర్ 55 సెంటర్లలో 100 రోజులు.. హైదరాబాద్ లో 162 రోజులు ఆడింది. ఆ ఏడాది చిరంజీవి ఆగష్టు 22న ఒకే రోజు నాలుగు సెంటర్లలో ( హైదరాబాద్, విజయవాడ, ఏలూరు, తిరుపతి) శతదినోత్సం నిర్వహించారు. ఇది కూడా ఓ రికార్డుగా నిలిచిపోయింది. హిందీలో ఆజ్ కా గూండారాజ్ గా చిరంజీవే హీరోగా రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: