రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ ప్రతిష్టాత్మక సినిమాలైన బాహుబలి, బాహుబలి 2 రెండూ కూడా ఒకదానిని మించి మరొకటి ఎంతో గొప్ప విజయాలు అందుకుని, టాలీవుడ్ కీర్తి ప్రతిష్టలను ఎంతటి ఉన్నత శిఖరాలకు చేర్చాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వి విజయేంద్రప్రసాద్ కథ, రాజమౌళి అత్యద్భుత దర్శకత్వం, హీరోగా ప్రభాస్ అనన్యసామాన్యమైన నటన, విలన్ గా దగ్గుబాటి రానా వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్, హీరోయిన్ గా అనుష్క అదిరిపోయే క్యారెక్టర్, సంగీత దర్శకుడిగా కీరవాణి సూపర్ మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కేకే సెంథిల్ కుమార్ వండర్ఫుల్ విజువల్స్ వెరసి ఈ సినిమాలను ఎంతో గొప్ప సక్సెస్ లు చేశాయి. బాహుబలి 2 దాదాపుగా రూ. 250 కోట్ల బడ్జెట్ తో రూపొంది, కలెక్షన్ పరంగా రూ.1,900 కోట్ల పైచిలుకు సంపాదించింది. 

IHG

ఇకపోతే అసలు మ్యాటర్ ఏంటంటే, ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్ సినిమాని చేస్తున్న ప్రభాస్, దాని అనంతరం వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా గురించి నేడు ఒక ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్వనీదత్ మాట్లాడుతూ, ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ లెవెల్లో తెరకెక్కనున్న ఈ సినిమాని, ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేస్తామని, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు ప్రారంభమయ్యాయని, తెలుగు సినిమా చరిత్రలో మాత్రమే కాక భారతీయ సినిమా చరిత్రలో కూడా ఎంతో గొప్ప పేరుతో నిలబడి పోయేలా ఈ సినిమాని దర్శకుడు అశ్విన్ తెరకెక్కించనున్నాడని అశ్వినిదత్ అన్నారు. 

IHG'Mahanati' <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DIRECTOR' target='_blank' title='director-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>director</a> Nag Ashwin ...

అలానే ప్రభాస్ ఇమేజ్ కి, మార్కెట్ కి తగ్గట్లుగా ఖర్చు కూడా ఎంతో భారీ స్థాయిలో ఉన్నట్లు చెప్పారు అశ్వనీదత్. ఇక ఆయన మాటలను బట్టి చూస్తుంటే, ఈ సినిమా బడ్జెట్ బాహుబలికి అమ్మ మొగుడులా ఉండనుందని, అయితే ఎంత ఎక్కువ బడ్జెట్ పెట్టినప్పటికీ, సినిమాలో ఆకట్టుకునే కథా కథనాలు మాత్రం ఉండి తీరాలని, ఒకవేళ ఆ విధంగా కనుక సినిమా తీయగలిగితే తప్పకుండా బాహుబలిని మించేలా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని అంటూ, పలువురు ప్రేక్షకులు తమ సోషల్ మీడియా మాద్యమాల ద్వారా కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: