టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ నిర్మాత గా తెరకెక్కిన భారీ ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ మూవీ 'జగదేకవీరుడు అతిలోకసుందరి'. 1990వ సంవత్సరం మే 9న అనగా ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఓవైపు రాష్ట్రంలో వర్షాలు, వరదలతో పలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్కచేయకుండా ప్రజలు ఈ సినిమా కోసం థియేటర్లకు ఎగబడేవారు అంటే, ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం, కలెక్షన్ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. 

 

ఒకానొక సందర్భంలో మంచి సోషియో ఫాంటసీ సినిమా చేయాలని ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న అశ్వినీదత్ కు దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ సినిమా కథను చెప్పటం, అలానే హీరోగా మెగాస్టార్ ను ఎంపిక చేయటం, అనంతరం అతిలోకసుందరి పాత్రలో శ్రీదేవి అయితే కరెక్ట్ అని భావించి ఆమెను ఎంపిక చేయడం జరిగిందట. ఇక సంగీతదర్శకుడిగా ఇళయరాజాని, అలాగే సినిమాటోగ్రఫీ కోసం కె ఎస్ ప్రకాష్, ఏ విన్సెంట్ లను ఎంపిక చేశారు. సినిమా యూనిట్ మొత్తం కూడా నిరంతరం శ్రమ పడి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా పెద్ద హిట్ సాధిస్తుందని యూనిట్ అందరూ అనుకున్నారట. అయితే అకాల వర్షాలు, వరదల వల్ల ఎంత మేర సినిమా ముందుకు నడుస్తుంది అని అనుమానం యూనిట్ సభ్యుల్లో ఉండడం జరిగిందని, అయినప్పటికీ ప్రజలు మాత్రం మంచి సినిమాని ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆదరిస్తాం అని దీని ద్వారా రుజువు చేశారని యూనిట్ ఎంతో ఆనందపడిందట. 

 

ఇక ఈ సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా 30 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో నిర్మాత అశ్వనీదత్ ఒక ప్రముఖ మీడియా చానెల్ తో నిన్న సాయంత్రం ప్రత్యేకంగా మాట్లాడుతూ, తమ సినిమా వచ్చి 30 ఏళ్ళు గడిచిందంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉందని, కొన్నాళ్ళ క్రితం ఈ సినిమాకి సీక్వెల్ తీద్దామని భావించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది వర్కవుట్ కాలేదని, అయితే అతి త్వరలోనే ఈ సినిమాకి సీక్వెల్ గా జగదేకవీరుడు అతిలోకసుందరి పార్ట్ 2 తీస్తానని అధికారికంగా ప్రకటన చేశారు అశ్వినీదత్. ప్రస్తుతం ప్రభాస్ తో నాగ అశ్విన్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించబోతున్నాం అని, దాని అనంతరం ఈ సినిమా సీక్వెల్ ని ప్రారంరంభిస్తాం అని అశ్వనీదత్ తెలిపారు. ఒకరకంగా ఈ న్యూస్ అందరికంటే ఎక్కువగా మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా సీక్వెల్ లో రామ్ చరణ్ నటించే అవకాశం ఉందని ఎప్పటి నుంచో పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరి ఈ సినిమా సీక్వెల్ విషయమై ఏం జరుగుతుందో ఏమిటో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే......!!

మరింత సమాచారం తెలుసుకోండి: