మన తెలుగు సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్లింది రాజమౌళి.. మనం రాజమౌళి సినిమా నుండి ఒకటి ఆశిస్తున్నాం అంటే అంతకు మించి ఈయన సినిమాల్లో ఉంటాయి.. ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాడు రాజమౌళి. ఇంకా మనం ఈ  రాజమౌళిని ఎంతో ప్రేమగా పిల్చుకునే పేరు జక్కన్న.. అయితే స్టూడెంట్ నెంబర్ 1తో మన ఇండస్ట్రీలోకి వచ్చి.. ఎన్నో సంచనాలు సృష్టించి.. బాహుబలి తో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసిన సెన్సేషన్ డైరెక్టర్ రాజమౌళి.. అలాంటి ఈ రాజమౌళి గురించి ఎవరికి తెలియని విషయాలు మీకోసం. 

 

1. అవును రాజమౌళి పూర్తి పేరు తెలుసా? మీకు ? తెలీదు కదా! అతని పూర్తి పేరు.. కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌలి.. ఇంకా ఇతను కర్నాటక రాయచూరు లో 1973లో పుట్టారు.. ఇంకా సినిమాలకు ముంది కొన్ని టీవీ సీరియల్స్ ని డైరెక్ట్ చేశారు.. ఆ సీరియల్స్ కూడా సూపర్ హిట్ అనుకోండి. 

 

2. రాజమౌళిని మనం ప్రేమగా పిల్చుకునే పేరు జక్కన్న.. ఇంకా ఆ పేరు పెట్టింది ఎవరో తెలుసా? రాజీవ్ కనకాల.. శాంతి నివాసం షూటింగ్ జరిగే సమయంలో ఇలా పిలిచారు.. ఇంకా అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ జక్కన్న అని పిలిచేవాడు.. దీంతో ఆ పేరు కాస్త ఫేమస్ అయిపోయింది. 

 

3. సంజయ్ లీల భన్సాలీ మన రాజమౌళితో రౌడీ రాథోర్ అదే విక్రమార్కుడు సినిమాని హిందీలో డైరెక్ట్ చేయించాలి అని అనుకున్నారు.. కానీ జక్కన్న కి ఉన్న కమిట్మెంట్ వల్ల ఈ సినిమాను ప్రభు దేవా డైరెక్ట్ చేశారు. 

 

4. రాజమౌలి ఫేవరేట్ యాక్టర్ మోహన్ లాల్.. అయితే స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత ఒక మైథలాజికల్ సినిమాని మోహన్ లాల్ తో చెయ్యాలి అని ప్లాన్ చేశారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు. 

 

5. రాజమౌళి 15 ఏళ్ళ సినీ కెరీర్ లో 10 సినిమాలు దర్శకత్వం వహించాడు.. అన్ని సినిమాలు సూపర్ హిట్.. ఇంకా బాహుబలి, మగధీర, ఈగ అయితే ఇంటర్నేషనల్ హిట్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: