కరోనా సమస్యతో షూటింగ్ లు ఆగిపోవడంతో చిన్న సినిమాలతో పాటు ‘ఆర్ ఆర్ ఆర్’ ‘ఆచార్య’ ‘వకీల్ సాబ్’ ప్రభాస్ జిల్ రాథా కృష్ణుల మూవీ షూటింగ్ లు అర్ధాంతరంగా ఆగిపోయాయి. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి భారీ పెట్టుబడులతో కూడుకున్న సినిమాలు కావడంతో ఈసినిమాల షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలుపెట్టి వేగంగా పూర్తిచేసి విడుదల చేద్దామా అన్న టెన్షన్ లో ఈమూవీ నిర్మాతలు ఉన్నారు.  


వాస్తవానికి లాక్ డౌన్ కొనసాగుతున్నా అనేకరంగాలకు మినహాయింపులు ఇవ్వడంతో సినిమా షూటింగ్ లకు కూడ మినహాయింపులు ఇచ్చి సహకరించమని ప్రభుత్వాలను ఇండస్ట్రీ ప్రముఖులు కోరుతున్నారు. దీనితో వీరి అభ్యర్థనకు స్పందిస్తున్న ప్రభుత్వాలు ఒకవేళ షూటింగ్ లకు అనుమతులు ఇచ్చినా షూటింగ్ స్పాట్ లో ఉండేటివంటి ప్రొడక్షన్ టీమ్ సంఖ్య 20 మందికి మించకూడదు అన్న కండిషన్ పెట్టబోతున్నట్లు సమాచారం. 


ఇలాంటి కండిషన్ పెడితే టాప్ హీరోల సినిమాలు షూటింగ్ లు ఒక్కరోజు కూడ నిర్వహించలేమని కనీసం 100 మంది ప్రొడక్షన్ టీమ్ లేకుండా టాప్ హీరోల సినిమాల షూటింగ్ లు ఒక్కరోజు కూడ చేయలేము అంటూ భారీ సినిమాల నిర్మాతలు నిట్టూర్పులు విడుస్తున్నట్లు టాక్. అయితే ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పటికీ దర్శకుడు తేజా తాను రానా తో తీయబోతున్న ‘రాక్షస రాజ్యంలో రావణాసురుడు’ మూవీ షూటింగ్ ను షూటింగ్ లకు అనుమతి లభించిన వెంటనే మొదలు పెట్టడానికి ఒక వెరైటీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. 


ఈసినిమాలో ఒక్క రానా తప్ప మిగతా నటీనటులు అంతా కొత్తవాళ్ళు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొత్త నటీనటుల ఎంపిక విషయమై ఈ లాక్ డౌన్ సమయంలో కూడ తేజ ఆన్ లైన్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అందరు కొత్తవారు అవ్వడంతో వీరవ్వరికీ వ్యక్తిగత సహాయకులు వ్యక్తిగత మేకప్ మెన్ బౌన్సర్లు ఇలా ఎవరూ లేకుండా చాల సింపుల్ గా వీరంతా షూటింగ్ స్పాట్ కు వస్తారు కాబట్టి ఒక్క రానా వ్యక్తిగత సహాయకులను మినహాయిస్తే చాల సులువుగా తాను ఈసినిమాను ప్రభుత్వ ఆంక్షలను అనుసరిస్తూ చాలా వేగంగా తీసి దేశంలో కరోనా అదుపులోకి వచ్చేలోగా తాను ఈ సినిమాను పూర్తి చేస్తాను అంటూ నిర్మాతలకు భరోసా ఇస్తున్నట్లు టాక్. ఇదే జరిగితే ‘ఆర్ ఆర్ ఆర్’ ‘ఆచార్య’ ‘వకీల్ సాబ్’ ప్రభాస్ ల లేటెస్ట్ సినిమాల షూటింగ్ ప్రారంభం కాకుండానే రానా లాంటి టాప్ సెలెబ్రెటీ నటించే సినిమాను మొదలు పెట్టి వేగంగా పూర్తిచేసే రికార్డు తేజా దక్కించుకుంటాడు అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: