తెలుగు తెర మీద తిరుగులేని హీరో నందమూరి తారక రామారావు. పౌరాణికాలు, జానపదాలు, సాంఘీకాల ఇలా జానర్‌ ఏదైన తెలుగు తెర మీద ఆయన కనిపిస్తే చాలు ప్రేక్షకులు జేజేలు పలికారు. ఇక తెర మీద ఆయన కృష్ణుడిగా కనిపిస్తే హరతులు పట్టారు. ఆ ఇమేజ్‌ను ఆయన్ను రాజకీయాల్లోనే విజేతగా నిలబెట్టింది. ఇంతటి మహా నటుడి జీవిత కథ సినిమాగా చేస్తే ఎంతటి విజయం సాధించాలి. కానీ అంచనాలు తారుమారయ్యాయి. ఎన్టీఆర్‌ బయోపిక్‌ బిగ్గెస్ట్ డిజాస్టర్ల సరసన నిలిచింది.

 

అందుకు చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలనుకోవటమే మొదటి తప్పు. ఎన్టీఆర్ సినీ జీవితంలో పెద్దగా మసాలా లేదు. ఆయన కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా నడిచింది. ఒకటి రెండు ఇబ్బందులు ఎదురైనా తరువాత హీరోగా ఎన్టీఆర్‌కు తిరుగులేదు. ఆయన నటనకు, ఆహార్యానికి వంక పెట్టే ఛాన్సే లేదే అలాంటి సమయంలో ఎన్టీఆర్‌ సినీ జీవితం మాత్రమే ఓ సినిమా చేస్తే ఏం కమర్షియల్ పాయింట్స్‌ ఉంటాయి. ఆ కారణంగానే ఎన్టీఆర్‌ కథానాయకుడు ప్రేక్షకులను అలరించలేకపోయింది.

 

ఇక ఎన్టీఆర్‌ మహానాయకుడు పరిస్థితి మరీ దారుణం. బాలయ్య ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఓ పార్టీ తరుపున ఎమ్మెల్యే కూడా ఆ పరిస్థితిలో ఎన్టీఆర్ చివరి రోజులను ఆయన సినిమాలో చూపించలేడన్న విషయంలో అందరికీ తెలుసు. ఆ చివరి రోజుల్లోనే ఎన్టీఆర్ జీవితం అసలు మలుపులు తిరిగింది. ఎన్టీఆర్‌ రెండో పెళ్లి చేసుకోవటం, దారుణమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠం కోల్పోవటం, తీవ్ర మానసిక సంఘర్షణకు లోనై తనువు చాలించటం ఇలా ఎన్నో మలుపులు ఉన్నాయి. అయితే అన్నింటిని పక్కన పెట్టేసిన బాలయ్య మహానాయకుడు సినిమాతోనూ తీవ్ర స్థాయిలో నిరాశపరిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: