మెగాస్టార్ చిరంజీవి... వెండితెర మీద మాస్ ఇమేజ్‌కు కేరాఫ్ అడ్రస్. తెలుగు సినిమాను కమర్షియల్ బాట పట్టించిన టాప్‌ హీరో. బాలీవుడ్‌ తారలు కూడా సాధ్యం కాని రికార్డ్‌లను ఎంతో ముందుగానే సాధించిన మెగా హీరో. అందుకే 10 ఏళ్ల విరామం తరువాత ఆయన తిరిగి వెండితెర మీద కనిపించినా ప్రేక్షకులు నిరాజనం పట్టారు. ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇస్తే అభిమానులు ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. ఇలాంటి రికార్డులు ఎన్నో సాధించిన మెగాస్టార్‌ బయోపిక్‌ తీస్తే వర్క్ అవుట్ అవుతుందా..?

 

ఈ విషయం మీద గతంలో మెగాస్టార్ కూడా స్పందించాడు. తన జీవితంలో కమర్షియల్ సినిమాకు కావాల్సిన మసాలా లేదని చెప్పాడు చిరు. అందుకే తన బయోపిక్ తీస్తే వర్క్ అవుట్ కాదంటూ చెప్పేశాడు. అందుకు కారణాలు లేకపోలేదు. చిరు సినిమా అవకాశాల కోసం కూడా పెద్దగా కష్టపడలేదు. కెరీర్‌ స్టార్టింగ్‌లో ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు పడినా కమర్షియల్ సినిమా కావాల్సినంత మసాలా మాత్రం లేదు. హీరోగా ప్రూవ్‌ చేసుకున్న తరువాత చిరు వెనుదిరిగి చూసుకోలేదు.

 

హిట్‌లు, ఫ్లాపులు వచ్చినా చిరు ఇమేజ్ మాత్రం పెరుగుతూనే వచ్చింది. అంటే చిరు సినీ జీవితం బయోపిక్‌ తీసేందుకు పెద్దగా సూట్ కాదు. ఒక వేళ చిరు రాజకీయ జీవితం ప్రస్థావించాల్సి వస్తే చిరు అందుకు అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే చిరు రాజకీయాల్లో దారుణంగా విఫలమయ్యాడు. అధికారం చేపట్టాలని ఆశించిన చిరు, కనీసం పోటి కూడా ఇవ్వలేకపోయాడు. మరి ఆ పాయింట్‌ను సినిమాలో ప్రస్థావించేందుకు చిరు అంగీకరిస్తాడా..? ఇలా అసలు మసాలా లేకుండా సినిమా తెరకెక్కిస్తే ఏ మాత్రం ఆకట్టుకోదు. అందుకే చిరు బయోపిక్‌ తెర మీదకు వచ్చే అవకాశం లేదు. అయితే ఒకవేళ చిరు బయోపిక్ రూపొందిస్తే మాత్రం రామ్ చరణ్‌ కన్నా సాయి ధరమ్‌ తేజ్ అయితే కరెక్ట్ అంటున్నారు ఫ్యాన్స్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: