సమంత గత కొన్ని నెలలుగా ఎక్కడా బయట కనపడకపోవడంతో చాలామంది ఆమె తల్లి కాబోతోంది అంటూ ఊహాగానాలు చేసారు. దీనికితోడు లాక్ డౌన్ కూడ కలిసి రావడంతో ఈ వార్తలు నిజమేనా అన్న సందేహాలు కూడా అందరి వచ్చాయి. అయితే అసలు విషయం వేరు. ప్రస్తుతం సమంత ఆన్ లైన్ లో యాక్టింగ్ క్లాసులు కోచింగ్ తీసుకుంటూ చాల బిజీగా ఉంటోంది.


ఇప్పటికే సమంతకు ఆమె నటనకు సంబంధించి ప్రేక్షకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడ వచ్చిన పరిస్థితులలో ఆమె ఇప్పుడు యాక్టింగ్ క్లాసులలో శిక్షణ తీసుకోవడం చాలామందికి ఆశ్చర్యకరమైన విషయం. హాలీవుడ్ సినిమాలతో పరిచయం ఉన్న వారికి హెలెన్ మేరిన్ పేరు తెలియని వారు ఉండరు. ‘ద క్వీన్’ సినిమాకు ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డ్ అందుకుంది. 


హాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో చాల మంచినటిగా పేరు తెచ్చుకున్న ఈమె ఆన్ లైన్ లో యాక్టింగ్ స్కిల్స్ మీద క్లాసులు చెపుతోంది. అత్యంత సహజంగా ఎలా నటించాలో ఈమె చెప్పే ఆన్ లైన్ యాక్టింగ్ క్లాసులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ ఆన్ లైన్ యాక్టింగ్ క్లాసులలో సమంత చేసి ఇండస్ట్రీకి వస్తున్న కొత్త అమ్మాయిలా చాల బుద్ధిగా పాఠాలు నేర్చుకుంటోంది. 


ఈ విషయమై సమంత స్పందిస్తూ 1000 గంటలలో చేయగల పనిని ఒక గంటలో చేయగలగడమే సమర్థత అని చెపుతూ తాను మరింత మంచి నటిగా మారడానికి ఈ ఆన్ లైన్ యాక్టింగ్ కోర్సులో శిక్షణ తీసుకుంటున్న విషయాన్ని వివరించింది. అంతేకాదు రానున్న రోజులలో తాను మరింత మంచి నటిగా తన అభిమానులు చూడబోతున్నారు అంటూ తన తదుపరి సినిమాల పై కూడ అంచనాలు పెంచుతోంది. నటన పట్ల కేవలం ఆసక్తి ఉంటె సరిపోదనీ దానిపట్ల ప్రేమ గౌరవం ఉన్నప్పుడే ఏ వ్యక్తి అయినా తాను ఎంచుకున్న రంగంలో రాణిస్తారు అంటూ సమంత అభిప్రాయం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: