కరోనా కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. థియేటర్లు మూతబడి, షూటింగులు నిలిచిపోయి చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ఎదుర్కోని క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. అయితే మూడవ విడత లాక్డౌన్ లో కొన్ని సడలింపులు ఇచ్చిన తర్వాత నిర్మాతల్లో ఒక ఆశ చెలరేగింది. మరికొన్ని రోజుల్లోనే సినిమా షూటింగులకి అనుమతులు వస్తాయన్న ధీమాతో ఉన్నారు. అయితే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా థియేటర్లు ఇప్పట్లీ తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు.

 

 

ఇదిలా ఉంటే లాక్డౌన్ పూర్తయ్యి షూటింగులకి అనుమతులు వచ్చాక చిత్ర పరిశ్రమ చాలా మారనుంది. ముఖ్యంగా కొత్తగా సినిమాలు స్టార్ట్ చేసే నిర్మాతలు హీరోలు, హీరోలకి ఇప్పుడున్నంత రెమ్యునరేషన్లు ఇచ్చుకోలేరు. దాంతో నటీనటులు పారితోషికాల విషయంలో తలొగ్గాల్సిందే. లేదంటే సినిమా భవితవ్యం ఆగమ్యగోచరంగా మారుతుంది. కాబట్టి పారితోషికాలు తగ్గించుకోవడం కంపల్సరీ.

 

 

ఇక రెండోది, భారీ బడ్జెట్ చిత్రాలు, ఎక్కువ మంది వర్కర్లు పనిచేసే చిత్రాలకి ఇప్పట్లో అనుమతులు దొరక్కపోవచ్చు. వందల మంది పనిచేసే దగ్గర జాగ్రత్తలు పాటించాల్సి రావడం కష్టమవుతుంది. దానివల్ల వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుంది. అందువల్ల పెద్ద చిత్రాలకి అనుమతులు వచ్చేది అనుమానమే. ఇక పోతే వందమంది కంటే తక్కువ వర్కర్లు పనిచేసే చిత్రాల షూటింగులకి అనుమతి ఈజీగా లభించవచ్చు.

 

 

ఇకపోతే హీరో హీరోయిన్లకి సెపరేట్ క్యారావాన్స్ కూడా ఉండవని అర్థమైపోతుంది. ముఖ్యులైన ప్రతీ ఒక్క నటులకి క్యారవాన్ ఇవ్వడం వల్ల బడ్జెట్ పెరిగిపోతుంది. అందువల్ల ఒకే క్యారవాన్ లో పార్టీషన్ చేసి ఇస్తారట. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే, ప్రభుత్వం షూటింగులకి అనుమతులు ఇచ్చిన నటీనటులు షూటింగ్ కి వస్తారా అన్న సందేహం చాలా మందిలో ఉంది. కరోనా భయం వారిని షూటింగ్ కి రప్పిస్తుందా లేదా అన్నది అనుమానమే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: