హీరోలు  రన్నింగ్ సినిమాలకోసం తమను తాము ఫిట్ గా తయారు చేసుకుంటున్నారు. సినిమా డిమాండ్ కు తగ్గట్టు జిమ్ముల్లో కుమ్ముతున్నారు.. క్యారెక్టర్ డిమాండ్ ను బట్టి అన్ని రకాల ఫీట్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.టాలీవుడ్ హీరోలు కరోనా లాక్ డౌన్ టైమ్ ను బాగా యూస్ చేసుకుంటున్నారు. టైమ్ పాస్ పనులు ఏవో ఒకటి చేస్తూనే.. నెక్ట్స్ సినిమాల కోసం తమను తాము ట్రైన్ చేసుకుంటున్నారు.మంచి టైమ్ దొరకడంతో ఫిట్ నెస్ మీద బాగా దృష్టి పెట్టారు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ కోసం ఎలా తయారయ్యడో ప్రోమో వీడియోలో చూశాము. అది అలా కాపాడుకుంటూనే.. బాక్సింగ్ లో ట్రైనింగ్ అవ్వడం కోసం.. కోచ్ ను తన దగ్గరే ఉంచేసుకున్నాడు.

 

రోజు టైమ్ దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. రామ్ చరణ్ కి ట్రైనింగ్ ఇచ్చిన రోజులు తన లైఫ్ లో మర్చిపోలేనివంటూ...ట్రైనర్  నీరజ్ గోయత్ తన సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేశాడు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాడు. పూరీ జగన్నాథ్ తో ఫైటర్ మూవీ చేస్తోన్న విజయ్.. ఆ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నానని.. కాని అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదని రీసెంట్ గా చెప్పేశాడు. ఈ లాక్ డౌన్ టైమ్ విజయ్ కు ఫిట్ నెస్ పెంచుకోడానికి.. ఉపయోగపడుతోంది.  ఫైటర్ మూవీ బాక్సింగ్ బ్యాగ్రౌండ్ తో తెరకెక్కుతోంది.

 

మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా లాక్ డౌన్ టైమ్ ను ఫిట్ నెస్ కోసం ఉపయోగించుకుంటున్నాడు. కొత్త డైరెక్టర్ కిరణ్ కొర్రపాటితో బాక్సింగ్ బ్యాగ్రౌండ్ మూవీ చేస్తున్నాడు వరుణ్. రామ్ చరణ్ కు బాక్సింగ్ కోచింగ్ ఇస్తోన్న నీరజ్ ఇటు వరుణ్ తేజ్ కు కూడా కోచింగ్ ఇస్తున్నాడు. షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వటంతో ప్రాక్టీస్ పోకుండా.. ఇంటిదగ్గరే కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇంకా ఫిట్ నెస్ కోసం జిమ్ములో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు ఆరడుగుల మెగా హీరో.

 

వీళ్లే కాదు.. యంగ్ హీరో నారా రోహిత్ కూడా ఈ రెండు నెలల్లో బాగా వెయిట్ తగ్గి.. ఫిట్ గా తయారయ్యడు. బొద్దుగా బుగ్గలుఉన్న నారా రోహిత్.. ఈ రెండు నెలలు బాగా కసరత్తులు చేసి.. బక్కగా.. ఫిట్ గా తయారయ్యాడు. గుర్తు పట్టలేనంతగా మారిపోయిన నారా రోహిత్ ఫోటో.. నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఇక యంగ్ హీరో నిఖిల్ కూడా ఫిట్ నెస్ మీద బాగా దృష్టి పెట్టాడు.. లాక్ డౌన్ అయిపోయేలోపు షర్టు విప్పి సిక్స్ ప్యాక్ చూపిస్తానని ఎప్పుడో ఎనౌన్ప్ చేశాడు. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. ప్రస్థుతం కార్తికేయ2 మూవీని పట్టాలెక్కించి ఉంచాడు నిఖిల్. ఇలా చాలా మంది తారలు లాక్ డౌన్ టైమ్ ను ఫిట్ నెస్ కోసం బాగా ఉపయోగించుకుంటున్నారు.  లాక్ డౌన్ లో టైమ్ దొరికింది కదా అని ఊరికే తింటూ కూర్చుంటే షేప్ అవుట్ అయిపోతావని భయంలో ఇలా ఫిటి నెస్ లు చేస్తున్నారు అంటున్నారు ఫ్యాన్స్ . 

మరింత సమాచారం తెలుసుకోండి: