ది సెన్సేషన్ ఆఫ్ టాలీవుడ్ విజయ్ దేవరకొండ ఈరోజు అనగా మే 9 2020 న తన 31 పుట్టిన రోజులు పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ ని ఓ ఇంటర్వ్యూయర్ ప్రశ్నిస్తూ... 'మీరు నిద్రపోయి లేచే సరికి ఎవరిగా మారాలని గట్టిగా కోరుకుంటారు?' అని అడగగా... దానికి జాహ్నవి కపూర్ టక్కున సమాధానమిస్తూ ' విజయ్ దేవరకొండ'. నాకు విజయ్ దేవరకొండ లాగా ఒక్కరోజైనా జీవితాన్ని గడపాలని ఉంది అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. దీన్ని బట్టి చూస్తే విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ సామాన్య యువతులతో పాటు సెలబ్రిటీల మనసులను కూడా దోచేసిందని అర్థమవుతుంది.


కేవలం జాహ్ణవి కపూర్ మాత్రమే కదా టోటల్ బాలీవుడ్ బామలు ఆలియా భట్, కియారా అద్వానీ ఇంకా చాలామంది విజయ్ దేవరకొండ చార్మింగ్ పర్సనాలిటీ కి ఫిదా అయిపోయారు. ఐతే విజయ్, తన తమ్ముడు ఆనంద్ కలసి పుట్టపర్తి సత్య సాయి ఉన్నత పాఠశాలలో ఒకటి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఈ పాఠశాలలో విద్యార్థులను చాలా స్ట్రిక్ట్ గా చదివిస్తారు. ఈ పాఠశాల యాజమాన్యం నెలకి ఒక్కసారి మాత్రమే సినిమా చూపిస్తారు. ఆ సినిమా కూడా విద్యార్థులకు ఉపయోగపడేలా ఉంటుంది. ఈ పాఠశాల పర్యవేక్షణ కారణంగానే విజయ్ కి ప్రస్తుత పర్సనాలిటీ డెవలప్ అయ్యింది.


కానీ విజయ్ దేవరకొండకు సినిమాలంటే చచ్చేంత ఇష్టం. పాఠశాలలో ఉన్నప్పుడు క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూడాలని ఎన్నో సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. అందుకే తాను సెలవల్లో ఎక్కువగా సినిమాలు చూసేవాడు. విజయ్ తన నాలుగవ తరగతిలోనే కథలు రాసేవాడు. స్కూల్లో చదివే రోజుల్లోనే తను ఆంగ్లభాషపై పట్టు సాధించాడు. ఇతను క్లాసికల్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నాడు కానీ క్రికెట్ ప్రపంచంలో మునిగిపోయి క్లాసికల్ మ్యూజిక్ ని మధ్యలోనే వదిలేసాడు. అప్పట్లో తాను నేర్చుకున్న క్లాసికల్ మ్యూజిక్ కారణంగానే తాను గీతా గోవిందం సినిమాలు ఒక పాటని కేవలం 45 నిమిషాల్లో పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.


2011 వ సంవత్సరంలో రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన నువ్విలా చిత్రంలో ఓ చిన్న క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ నటించాడు. ఆపై మరికొన్ని సినిమాల్లో ఆయన నటించాడు కానీ 2016 లో పెళ్లి చూపులు సినిమా తరువాతనే అతడికి బాగా పేరు వచ్చింది. 2017 సంవత్సరంలో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమాలో కథానాయకుడి పాత్రలో నటించిన విజయ్ దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: