రోజురోజుకి తెలుగు రాష్ట్రాలలో కరోనా ఉధృతి పెరిగిపోతున్న పరిస్థితులలో ఇప్పటి వరకు లాక్ డౌన్ తో కాపాడిన ప్రభుత్వాలు వరసెట్టి సడలింపులు ఇస్తూ ‘ఇక మనదే బాధ్యత’ అన్న సంకేతాలు ఇస్తున్నాయి. దీనితో ప్రజలు కరోనా తో కలిసి బతక వలసిందే అన్న నిర్ణయానికి మానసికంగా వస్తూ ఎవరికీ వారు తమ నిత్య జీవితంలో జాగ్రత్తలు తీసుకోవడంతో బిజీగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ సడలింపులు వల్ల కరోనా ముప్పు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


ఇలాంటి పరిస్థితులలో ధియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియకపోవడంతో పాటు ధియేటర్లు తెరిచినా జనం రారు అన్న సందేహాలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో సినిమాలు విడుదల పై కొనసాగుతున్న కన్ఫ్యూజన్ కు ‘నిశ్శబ్దం’ చాల నిశ్శబ్ధంగా చెక్ పెట్టబోతోంది. 


ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ నిర్మాతలు ఈ మూవీ ఒటిటీ రిలీజ్ కు లైన్ క్లియర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘నిశ్శబ్దం’ ఒటిటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కు ఇచ్చే విషయంలో చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు టాక్. అయితే అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమ్ అయ్యే రోజునే అదే రోజున ఒక ప్రముఖ ఛానల్ లో ‘నిశ్శబ్దం’ సినిమాను విడుదల చేయడానికి కోన వెంకట్ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఈ కరోనా కష్ట కాలంలో ఒకే  దెబ్బకు రెండు పిట్టలు సామెతను నిజం చేస్తున్నట్లు తెలుస్తోంది. 


మూవీ ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరించడంతో పాటు ఈ మూవీలో ప్రముఖ నటీనటులు అందరు నటించడంతో ఈ మూవీ బడ్జెట్ 30 కోట్లకు చేరుకుంది అని అంటున్నారు. దీనితో ఈ మూవీ విడుదల గురించి వేచి చూసేకంటే ఈ మూవీని ఒకవైపు అమెజాన్ లో మరొక వైపు టివి ఛానల్ లో విడుదల చేసే ఒక కొత్త ప్రయోగానికి ఈ మూవీ నిర్మాతలు ఈ లాక్ డౌన్ సమయంలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు విజయవంతం అయితే నాని ‘వి’ తో పాటు మరిన్ని మీడియం రేంజ్ సినిమాలు ఈ పద్ధతిని అనుసరించే ఆస్కారం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: