గత నాలుగు సంవత్సరాలుగా టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా తరువాత అతని కెరీర్ తార స్థాయికి చేరుకుంది. కేవలం తెలుగులోనే కాదు పలుభాషల్లో ఆ సినిమాని డైరెక్ట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. అన్ని భాషల్లో సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ ఏ హీరో విజయ్ అంత కోపంతో చాలా సహజంగా నటించలేదని చెప్పుకోవచ్చు.


నిజానికి సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన వారు సక్సెస్ కావాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. పట్టుదలతో ప్రతిభ తో పాటు అదృష్టం ఉంటేనే సినీరంగంలో ఎవరైనా ఎదగగలరు. విజయ్ దేవరకొండ ఈ మూడిటితోనే పైకొచ్చాడు. ఈయన తో పాటు కలిసి వచ్చిన ఎంతో మంది కుర్ర ఆస్పైరింగ్ హీరోలు, అతని కంటే చాలా సంవత్సరాల ముందే సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన వారు కూడా పేరు రావడం కోసం ఎంతో కష్టపడుతున్న వేళ... ఓ శుక్రవారం రోజు మిరాకిల్ జరిగింది. అసలు విజయ్ దేవరకొండ హీరో అని తెలియని వారు కూడా అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అసలైన హీరో అంటే ఇతనే అని అన్నారంటే అతని క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.


విజయ్ దేవరకొండ తన కెరీర్ ప్రారంభంలో ఏ చిన్న షార్ట్ ఫిలింలో అవకాశం దొరికినా నటించేవాడు. ప్రతి ఒక్క ఆడిషన్స్ కి వెళ్లి నటన పరంగా తన అనుభవాన్ని పెంచుకునేవాడు. అయితే ఒకానొక రోజు తాను కేవలం ఐదు గంటల వ్యవధిలోనే ఒక ఘోస్ట్ షార్ట్ ఫిలిం తీసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఆ దయ్యం షార్ట్ ఫిలిం పేరు 'మేడం మీరేనా'.


ఎనిమిది నిమిషాల నిడివిగల ఈ షార్ట్ ఫిలిం లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించిన శ్రీరామ్ వెంకటేష్ మొదటి నుంచి చివరి వరకు కనిపిస్తాడు. ఈ హారర్ త్రిల్లింగ్ షార్ట్ ఫిలిమ్ అన్ని దయ్యాల షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ తోనే రూపుదిద్దుకుంది. ఈ షార్ట్ ఫిలిం కోసం తొలిసారిగా దర్శకుడి అవతారమెత్తిన విజయ్ తనకు యాక్టింగ్ పై తప్ప మరేతర దానిపై ఆసక్తి లేదని మళ్ళీ నటనపైనే తన ఏకాగ్రత పెట్టాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: