టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉంది అనేది అందరికి తెలిసిన విషయమే. ఆయన సినిమా అనగానే ఫాన్స్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులకు ఒకరకంగా పండగ వాతావరణమే. తెలుగు ప్రేక్షకులు అయితే ఆయన నటనకు ఫిదా అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన సినిమాలకు కాస్త ఆదరణ తగ్గవచ్చు ఏమో గాని గతంలో ఆయన అంటే కొందరికి పిచ్చి క్రేజ్ ఉండేది. ఫ్యాక్షన్ సినిమాలు అంటే బాలకృష్ణ అనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది. 

 

ఇక ఆయన బయోపిక్ తీస్తే ఎలా ఉంటుంది అనేది కొందరి ఆలోచన. మరి ఆయన బయోపిక్ ని ఏ విధంగా తీసుకొచ్చే అవకాశం ఉంది...? అసలు హీరో ఎవరు అయితే బాగుంటుంది..? బాలకృష్ణ పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుంది అనేది చూస్తే... బాలయ్య పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటారు అని కొందరు అంటే కాదు శర్వానంద్ బాగుంటాడు అని మరికొందరు, అసలు బాలయ్య పాత్రను ఎవరూ చేయలేరు అని మరికొందరు అంటున్నారు బాలకృష్ణ పాత్రను చెయ్యాలి అంటే గట్స్ ఉండాలి అనేది మరికొందరి మాటగా చెప్తున్నారు. 

 

ఇప్పుడు బాలకృష్ణ బయోపిక్ అంటే ఆయన సినిమాలే ఎక్కువగా ఉంటాయి. కథ రెడీ చేయడం కూడా కష్టమే. అయితే రాజకీయం మాత్రం ఆయన సినిమాలో చాలా తక్కువగా ఉంటుంది. ఒక సినిమా హీరోగా సేవా కార్యక్రమా లు చేసే వ్యక్తిగా ఆయన సినిమాను తీసుకొచ్చే అవకాశం ఉంది మరి ఈ సినిమాలో ఏ హీరో అయితే బాగుంటుంది ఏ దర్శకుడు అయితే బాగుంటుంది అనేది బాలకృష్ణ ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ అయితేనే సరిగా సరిపోతారట. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: