ప్రస్తుతం భారత చిత్ర పరిశ్రమలో బయోపిక్ ల హవా నడుస్తున్న తరుణంలో ఇండస్ట్రీలో సినీ రాజకీయ క్రీడా రంగాల ప్రముఖుల జీవిత చరిత్రను సినిమాగా మలుస్తున్నారు దర్శకులు. అయితే ఇప్పటికే ఎంతోమంది సినీ రాజకీయ క్రీడా రంగాల ప్రముఖుల బయోపిక్లు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో ఎంతగానో పేరుప్రఖ్యాతలు సంపాదించి... తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తెరకెక్కిస్తే బాగుండు అని కోరుకోని  మెగా అభిమాని  ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో మెగాస్టార్ బయోపిక్ కి సంబంధించి కొన్ని వార్తలు కూడా ప్రచురితం అయినప్పటికీ అవి అవాస్తవమని తేలిపోయింది. 

 

 

 ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి అరడజనుకు పైగా హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ప్రత్యేక గుర్తింపు సంపాదించిన  విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న మెగా హీరోలలో ఒకవేళ చిరంజీవి బయోపిక్ తెరకెక్కిస్తే ఏ  హీరో అయితే మెగా స్టార్ పాత్రలో సరిగ్గా సరిపోతాడు  అనే ప్రశ్న అభిమానులందరి లో ఉండటం సహజం. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తండ్రి పాత్రలో నటిస్తే బాగుంటుందా లేదా ఇతర మెగా హీరోలు నటిస్తే బాగుంటుందని అనేది అభిమానుల్లో  నెలకొన్న ప్రశ్న. 

 

 

 ఇక ఈ ప్రశ్నకు ఒకానొక సమయంలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తన బయోపిక్ లో తన పాత్రలో  ఎవరు నటిస్తే బాగుంటుంది అన్న దానికి ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు. ఒకవేళ తన బయోపిక్ తెరకెక్కిస్తే తన బయోపిక్ లో  సాయి ధరంతేజ్ నటిస్తే బాగా సెట్ అవుతాడు అంటూ చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే చిన్నప్పటినుంచి సాయి ధరంతేజ్ లో నా పోలికలు ఎక్కువగా ఉంటాయని చాలా మంది నాతో చెప్పారని... నా బయోపిక్ తెరకెక్కిస్తే నా పాత్రలో సాయి ధరంతేజ్ అయితే బాగా సెట్ అవుతారని... లేనిపక్షంలో చరణ్ తన పాత్రలో నటిస్తే బాగుంటుందని అంటూ చిరంజీవి తన మనసులో ఉన్న మాట చెప్పేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: