తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి స్టార్ హీరోయిన్ అయిన మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఆ తర్వాత చాలానే బయోపిక్లు తెరకెక్కాయి . ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ హీరో అయిన నందమూరి బాలకృష్ణ... తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి.. అలనాటి స్టార్ హీరో అయిన సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించారని భావించి ఈ సినిమాలో తండ్రి ఎన్టీఆర్ పాత్రలో తానే నటించి... తానే నిర్మాతగా మారి  ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా రెండు పార్ట్ లుగా వచ్చింది. 

 

 

 మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ ప్రస్థానం గురించి చెబితే రెండవ భాగంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి చెప్పారు. అయితే ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ మాత్రం పొందలేక పోయింది అని చెప్పాలి.ఈ బయోపిక్ విషయంలో అంతా బాగానే ఉన్నప్పటికీ ఎక్కడో నాచురాలిటీ మిస్ అయింది అని ప్రేక్షకులు భావించారు. దీంతో ఈ సినిమా కాస్త ఫ్లాప్  గానే మిగిలిపోయింది. దీంతో అటు బాలకృష్ణ కూడా భారీ నష్టాల్లో కూరుకు పోయారు. 

 

 

 ముఖ్యంగా ఈ సినిమాలో కేవలం పాజిటివ్ మాత్రమే చూపెట్టారు అని అప్పట్లో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయి నటించిన తీరు మాత్రం ఎంతో మందిని ఆకట్టుకుంది అనే చెప్పాలి. బాలకృష్ణ నటనకు మాత్రం ప్రశంసలు బాగానే దక్కాయి . తండ్రి పాత్రలో ఒదిగిపోయి మరి బాలకృష్ణ నటించాడని ఎంతో మంది ప్రశంసలు కురిపించారు. అయితే తండ్రి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయి నటించినప్పటికీ కథ పరంగా మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేక పోయింది ఈ బయోపిక్. దీంతో టాలీవుడ్ లో డిజాస్టర్  బయోపిక్ గానే మిగిలిపోయింది ఈ సినిమా .

మరింత సమాచారం తెలుసుకోండి: