టాలీవుడ్ లో హడావుడి లేకపోయినా కొందరు నటుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడూ మీడియా లో లేకపోయినా సరే వార్తల్లో వాళ్ళ గురించి చర్చలు లేకపోయినా సరే కొందరి గురించి మాత్రం ఎక్కువగా చర్చలు జరుగుతూ ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే నటులు కొందరు ఉంటారు. టాలీవుడ్ లో అలా చెప్పుకునే నటుడు జగపతి బాబు. స్టార్ నిర్మాత కుమారుడు అయినా సరే తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చిన ఆయన టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్నారు అనేది వాస్తవం. 

 

టాలీవుడ్ లో అడుగు పెట్టిన కొత్తలో ఆయన చేసిన సినిమాలు సాధించిన విజయాలు ఏ హీరో కూడా సాధించలేదు అనేది వాస్తవం. అయితే ఆయన కెరీర్ లో వరుస ఫ్లాపులు బాగా ఇబ్బంది పెట్టాయి. ఒక్క మంచి సినిమా కూడా దాదాపు 15 ఏళ్ళ పాటు ఆయన చేయలేదు. దీనితో సినిమాల నుంచి ఆయన తప్పుకోవడమే మంచిది అనే సూచనలు కూడా వచ్చాయి. ఈ సమయంలో ఆస్తులను కూడా ఆయన భారీగా పోగొట్టుకున్నారు. చిన్నప్పుడు పెరిగిన ఇల్లు కూడా ఆయన అమ్ముకునే పరిస్థితి వచ్చింది. 

 

ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఆయన లేకపోతే సినిమా అసలు బాగుండదు అనే విధంగా జగపతి బాబు నటించి మెప్పించారు. ఇప్పుడు కెరీర్ లో ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఆయన బయోపిక్ తీస్తే ఎవరు అయితే బాగుంటుంది అంటే టాలీవుడ్ లో ఏ హీరో కూడా ఆయనకు సరిపోయే అవకాశం లేదని ఒక్క తమిళ హీరో మాత్రమే ఆయనకు సరిపోయే అవకాశం ఉందని అంటున్నారు. విజయ్ సేతుపతి అయితే ఆయనకు సరిగా సరిపోతారు అని ఏ హీరో కి కూడా ఆయన సినిమాను చేసే దమ్ము లేదని అంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: