టాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తున్న సమయంలో అలనాటి తారల కు సంబంధించిన బయోపిక్లు ప్రస్తుతం దర్శక నిర్మాతలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆనాడు తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించి  మహానటిగా ఎంతగానో పేరుప్రఖ్యాతలు సంపాదించిన సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తీసుకెక్కిన  మహానటి సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆ తర్వాత ఆ నాడు తెలుగోడి జాతిని ఎంతగానో పెంచిన అన్నగారు ఎన్టీఆర్ బయోపిక్ కూడా తెరకెక్కింది.అయితే ఈ క్రమంలోనే ఆనాడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగి... నటసామ్రాట్ గా తెలుగు టాలీవుడ్ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ కూడా తెరకెక్కుతుంది అని అప్పట్లో వార్తలు వచ్చాయి.

 

 

 అయితే ఈ వార్తలు కేవలం వార్తలు గానే మిగిలిపోయాయి. దీనిపై అక్కినేని వారసుడు అయిన నాగార్జున తన తండ్రి బయోపిక్ గురించి ఎక్కడ స్పందించలేదు. కానీ అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కిస్తే చూడాలని ఎంతో మంది అక్కినేని అభిమానులు మాత్రం ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ బయోపిక్ కి సంబంధించిన సన్నాహాలు అయితే ఏమీ జరగడం లేదని సమాచారం. అయితే ఒకవేళ అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కిస్తే ఏఎన్ఆర్ పాత్రలో ఏ హీరో అయితే బాగా సెట్ అవుతారు అన్న ప్రశ్న కూడా అభిమానుల్లో నెలకొంది. 

 

 

 అయితే కొంతమంది ఏఎన్ఆర్ పాత్రలో తన మనవడు అక్కినేని నాగచైతన్య అయితే సరిగ్గా సరిపోతాడని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే అక్కినేని నాగ చైతన్య... తాత అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో పలు సినిమాల్లో కనిపించారు కూడా. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో ఏఎన్నార్ పాత్రలో కనిపించారు నాగ చైతన్య. అందుకే ఏఎన్ఆర్ బయోపిక్ లో కూడా నాగచైతన్య నటిస్తే బాగుంటుందని కోరుకునే అక్కినేని అభిమానులు ఎంతో మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: