వ్యాపారం ప్రేమ జీవితం వివాహం స్నేహం ఉద్యోగం ఇలా జీవితంలోని ఏవిషయం చూసుకున్నా గెలుపు ఓటమి లపై ఆధారపడుతు ఈ అన్ని విషయాలు సూక్షంగా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. గెలిచే వ్యక్తి ఓటమిని అంగీకరిస్తాడు కాని ఎప్పుడు ఓడిపోయే వ్యక్తి ఓటమిని అంగీకరించలేడు.


ఈ సందర్భంలో మనీ ఎక్స్ పర్ట్స్ డబ్బు సంపాదన గురించి వివరిస్తూ ప్రధానంగా మూడు లక్షణాలు కలిగిన వ్యక్తులు డబ్బును చాల సులువుగా సంపాదిస్తారు అంటూ ఒక విశ్లేషణ చేస్తున్నారు. ఆ మూడు లక్షణాలలో ప్రధానంగా పేర్కొన వలసినది ఆత్మ విశ్లేషణ. మన గురించి మనం ఆలోచించుకున్నంతగా ఎదుటి వ్యక్తులు మన గురించి ఆలోచించరు అన్న వాస్తవాలను గ్రహించిన వ్యక్తులు మాత్రమే ధనవంతులు అవుతారని అభిప్రాయపడుతున్నారు.


అదేవిధంగా మనకు నచ్చింది మనం చేయకుండా ఆ పనిని మరెవ్వరో చేస్తారని ఆశించే వారు కూడ ఎప్పుడు జీవితంలో ధనవంతులు కాలేరు. ఇక మరీ ముఖ్యంగా మనతో అవసరం ఉన్నవాళ్ళు మాత్రమే మన దగ్గరకు వస్తారు అన్న వాస్తవాన్ని పూర్తిగా వాస్తవ దృష్టితో గ్రహించకుండా ఏవ్యక్తి ధనవంతుడు కాలేడు. అదేవిధంగా ఇతర వ్యక్తుల జీవితాల గురించి ఆలోచనలు చేస్తూ తమ విలువైన కాలాన్ని వృథా చేసుకునే వారు కూడ ధనవంతులు కాలేరు.


ముఖ్యంగా మన జీవితంతో మనం రాజీ పడటం మన పై మనమే ద్వేషించుకోవడం మనలను చూసుకుని మనమే సిగ్గుపడటం లాంటి నెగిటివ్ లక్షణాలను కలిగిన వ్యక్తులు కూడ ధనవంతులు కాలేరు. వాస్తవానికి మనలో చాలామంది ప్రతి రంగంలోనూ వేలు పెడుతూ ఏ ఒకటైన కలిసి రాకపోతుందా అన్న ఆశతో ఉంటారు. అయితే మనకు ఏవిషయంలో సమర్థత ఉందో తెలుసుకోకుండా అన్ని రంగాలలో రాయి విసరడం వల్ల వరసపెట్టి పరాజయాలు వచ్చే ఆస్కారం ఉంది. అందువల్లనే చాలామంది తమ జీవితంలో కేవలం ఐదు శాతం మాత్రమే తమ గురించి తాము ఆలోచించుకుంటే మిగతా 95 శాతం మంది ఇతరుల గురించి ఆలోచనలు చేస్తూ కాలం గడిపేస్తారు. దీనితో శారీరక బలహీనతలు మాత్రమే కాకుండా తమ అంతర్గత బలహీనతలను జయించిన వాడే నిజమైన సంపన్నుడుగా మారగలడు..

మరింత సమాచారం తెలుసుకోండి: